అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1959 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి బహుగ్రంథ కర్త. ఆయన రచనల్లో ముద్రితములూ, అముద్రితాలూ కూడా ఉన్నాయి.
=== ముద్రిత గ్రంథాలు ===
ఆయన ముద్రిత కావ్యాల్లో '''భార్గవ రామ చరిత్ర''' అనే మహాకావ్యం కూడా వుంది. హైహయులు, వారి అనుయాయులైన క్షత్రియులు ప్రజలను పీడించడంతో బ్రాహ్మణులు మొదలైన ఇతర మూడు వర్ణాల వారు ఒక్కటై వారితో పలుమార్లు పోరాడి ఓడిపోయారనీ, తమ ఓటమికి నాయకత్వలేమి కారణమని గ్రహించి నీతిశాస్త్ర విశారదుడు, శూరుడు అయిన బ్రాహ్మణ వీరుడిని ([[పరశురాముడు]]) సైన్యాధిపత్యానికి ఒప్పించి, సర్వ క్షత్రియులను జయించినట్టు మహాభారత ఉద్యోగపర్వంలోని సైన్య నిర్యాణ పర్వంలో 5 శ్లోకాల్లో సంగ్రహంగా ఉంది. దీన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఇతర పురాణాల్లో ఉన్న పరశురామ గాథలను సమన్వయం చేసుకుంటూ ఈ మహాకావ్యాన్ని నిర్మించారు సుబ్రహ్మణ్యశాస్త్రి.<br />
హరిహరోపాధ్యాయుడు సంస్కృతంలో రాసిన వేదాంత ప్రధానమైన గ్రంథాన్ని '''శ్రీ భర్తృహరి నిర్వేదము''' పేరిట ప్రబంధాన్ని రచించారు. మూలంలోని భావాన్ని వదలక, తనదైన ప్రత్యేక కావ్యంగా దీన్ని ఆయన తీర్చిదిద్దారు. ఈ కావ్యంలో భర్తృహరి తన భార్య భానుమతీదేవి మౌనముద్రకు కారణం తెలియక ఆమెను అనునయించే ఘట్టాన్ని [[పారిజాతాపహరణం]]లోని సత్యభామ అలక ఘట్టానికి సాటివచ్చేలా రచించే ప్రయత్నం చేశారు. [[సుభాషిత త్రిశతి]] రచించిన [[భర్తృహరి]] జీవితంలో అందుకు పాదులు వేసిన ఘట్టాలను, ఆయన వేదాంతి కావడం వంటివి ఈ కావ్యవస్తువు.<br />
'''కావ్యగుచ్ఛము''' అనే మరో గ్రంథంలో తారాచంద్రుల ఇతివృత్తం, అష్టావక్రుని బ్రహ్మచార దీక్షకు పరీక్షాఘట్టం వంటి పలు ఇతివృత్తాలతో నిర్మించిన చిరు కావ్యాలు గుదిగుచ్చారు. '''విద్వద్దంపతీ విలాసము''' అనే మరో కావ్యంలో విదుషీమణి ఐన కాపుకులస్త్రీ, బ్రాహ్మణుడు ప్రేమించి ఫలించక మరణిస్తారు, తర్వాత ఈజిప్ట్ దేశంలో మళ్ళీ పుట్టి ప్రేమ ఫలింపజేసుకుంటారు. ఈజిప్టులో వారిద్దరి కలయికకు ఇతివృత్తాన్ని ప్రఖ్యాత [[అరేబియన్ నైట్స్]] లోని ఒక కథను తీసుకుని దాని అనుసృజనగా చేశారు. కాకతీయుల నాటి ఇతివృత్తంతో '''కుమార రుద్రదేవకవి''', '''బమ్మెర పోతన''', పౌరాణికాంశాలతో '''భారతీయ స్త్రీ ధర్మాలు''', '''శ్రీకృష్ణ చరిత్ర''' రాశారు. ఇవన్నీ వివిధ సంస్థలు ముద్రించినవి.<br />