జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:g_varalakshmi.jpg|right|frame|జి.వరలక్ష్మి]]
'''గరికపాటి వరలక్ష్మి''' ([[సెప్టెంబర్ 13]], [[1926]] - [[నవంబర్ 26]], [[2006]]) అందరికీ '''జి.వరలక్ష్మి'''గా సుపరిచితురాలైన అలనాటి [[తెలుగు సినిమా]] నటీమణి. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.
 
1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.
 
==జీవిత విశేషాలు==
వరలక్ష్మి [[సెప్టెంబర్ 13]], 1926లో[[1926]] లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి ''సక్కుబాయి'' మరియు ''రంగూన్ రౌడీ'' నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను [[కె.ఎస్.ప్రకాశరావు]] మరియు [[హెచ్.ఎం.రెడ్డి]] వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం [[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.
 
వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన [[కె.ఎస్.ప్రకాశరావు]]ను వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.
 
== మరణం ==
వరలక్ష్మి [[2006]], [[నవంబర్ 26]] న [[మద్రాసు]]లో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/జి.వరలక్ష్మి" నుండి వెలికితీశారు