రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
==సూర్యరాయాంధ్ర నిఘంటువు==
[[దస్త్రం:Rao Venkata Kumara Mahipati Surya Rao.jpg|thumbnail|150px| సూర్యారావు తైలవర్ణపటం]]
ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. [[1911]], [[మే 12]] న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో [[జయంతి రామయ్య]] పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. [[జయంతి రామయ్య]] ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు [[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]] అని నామకరణం చేశారు. ఈ నిఘంటు నిర్మాణానికి [[కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి]], [[తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య]], [[పురాణపండ మల్లయ్యశాస్త్రి]], [[పేరి పాపయ్యశాస్త్రి]], [[శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి]], [[కూచి నరసింహం]], [[చర్ల నారాయణశాస్త్రి]], [[పిశుపాటి చిదంబర శాస్త్రి]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]], [[దర్భా సర్వేశ్వరశాస్త్రి]], [[పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి]], [[ప్రయాగ వేంకటరామశాస్త్రి]], [[అమలాపురపు విశ్వేశ్వరశాస్త్రి]], [[బులుసు వేంకటేశ్వర్లు]], [[చిలుకూరి వీరభద్రశాస్త్రి]], [[దువ్వూరి సూర్యనారాయణశాస్త్రి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[చెఱుకుపల్లి అప్పారాయశాస్త్రి]], [[ఇంద్రగంటి సూర్యనారాయణశాస్త్రి]], [[చిలుకూరి విశ్వనాథశాస్త్రి]], [[ఆకుండి వేంకటశాస్త్రి]], [[ఓలేటి సూర్యనారాయణశాస్త్రి]], [[పాలెపు వెంకటరత్నం]], [[సామవేదం శ్రీరామమూర్తిశాస్త్రి]], [[పన్నాల వేంకటాద్రిభట్టశర్మ]], [[దివాకర్ల వేంకటావధాని]] మొదలైన పండితులు పాల్గొన్నారుపాటుపడ్డారు.
 
==కవిపండితపోషణ==