ఉప్పెన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సునామీ: లంకె తగిలించేను
చి clean up, replaced: నవంబరు → నవంబర్ (2) using AWB
పంక్తి 1:
 
[[File:2004-tsunami.jpg|thumb|right|2004-tsunami.jpg]]
==చరిత్ర==
* [[అక్టోబరు 13]] న వచ్చిన పెను తుపానులో [[కృష్ణా జిల్లా]], [[మచిలీపట్నం]] ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు ట!
 
రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబరునవంబర్ 1864 న, [[బందరు]]లో [[సముద్రం]] పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని "బందరు ఉప్పెన" అని ప్రజలు అభివర్ణిస్తారు.
 
ఇటీవల, అనగా 19 నవంబరునవంబర్ 1977 న, కృష్ణా డెల్టాలోని [[దివిసీమ]] ములిగిపోయి 10,000 మందికి పైబడి చచ్చిపోయారుట. అపారమైన ధన నష్టంతో పాటు, 10 లక్షల పశువులు కూడ అసువులు బాసేయని వార్తా పత్రికలలో వచ్చింది. దీనిని "దివిసీమలో ఉప్పెన" అని పత్రికలు రాసేయి.
 
ఇటీవల, అనగా 26 డిసెంబరు 2004 తేదీన, [[ఇండోనేసియా]] దగ్గర [[హిందూ మహాసముద్రం]]లో [[భూకంపం]] కారణంగా వచ్చిన సునామీ వల్ల 30 మీటర్లు ఎత్తున్న కెరటాలు వచ్చి మీద పడడంతో [[శ్రీలంక]] తూర్పు తీరం, [[తమిళనాడు]], [[ఆంధ్ర ప్రదేశ్]] తీర ప్రాంతాలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ సునామీ తాకిడి [[ఆఫ్రికా]] ఖండపు పశ్చిమ కోస్తా వరకు ప్రయాణించింది. దీని బీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు టెలివిషన్ తెరల మీద చూసేరు కనుక ప్రత్యేకించి వివరణ రాయక్కరలేదు.
Line 12 ⟶ 11:
[[విశాఖపట్నం]] మీద 12 అక్టోబరు 2014 న విరుచుకుపడ్డ [[హుద్‌హుద్ తుఫాను|హుద్‌హుద్]] అనే తుపాను తాకిడితో మరో రకం భయానక దృశ్యాన్ని చూసేం.
 
సుమారు 1956 ప్రాంతాలలో ఒకనాడు రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి కాని, వాన కాని లేవు. [[కాకినాడ]] ఇంజనీరింగు కాలేజీ ప్రాంగణంలోకి “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది విద్యార్థులు హాస్టల్ వదిలిపెట్టి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది.
 
ఈ అనుభవాల నేపథ్యంలో [[:en:Tide|ఆటుపోట్లు]] (tides), [[ తుఫాను|తుపాను]] (cyclone), ఉప్పెన, [[:en:tidal waves|టైడల్ వేవ్]], సునామీ, [[:en:tornado|చక్రవాతం]] (tornado) అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయా లేక ఒక మాటకి బదులు మరొక మాట వాడెయ్య వచ్చా అన్న అనుమానం రాక మానదు. పామరులు, పాత్రికేయులు, పండిత వర్గాలు ఈ మాటలని అజాగ్రత్తగా వాడి కొంత గందరగోళానికి కారకులయ్యారు.
 
శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. అంతే కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అంటే, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం.
 
==గాలివాన, తుపాను, చక్రవాతం==
 
గాలితో వచ్చే వాన గాలివాన. ఈ గాలి వేగం ఒక హద్దు మీరి (ఉరమరగా గంటకి 75 మైళ్లు) ఉంటే అది తుపాను. హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులని "సైక్లోనులు" (cyclones) అంటారు. [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో పుట్టే తుపానులని “హరికేన్” (hurricane) అనిన్నీ, [[పసిఫిక్ మహాసముద్రం]]లో - అంతర్జాతీయ తేదీరేఖకి తూర్పున - పుట్టేవాటిని “టైఫూన్” (typhoon) అనిన్నీ అంటారు. అనగా, మౌలికంగా ఈ మూడు మాటల అర్థాలలోను తేడా లేదు. ఈ తుపానులలో వీచే గాలి జోరు ఒక హద్దు (గంటకి 40 మైళ్లు) దాటితే దానికి నామకరణం చేస్తారు. అంటే, అన్ని గాలివానలూ తుపానులు కావు, అన్ని తుపానులకీ పేర్లు పెట్టరు.
 
కొన్ని చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి అతి వేగంతో తిరుగుతూ వస్తుంది. గరాటు ఆకారంలో ఉన్న ఆ సుడిగాలి అడుగు భాగం భూమిని తాకుతూ, పై భాగం మేఘాలని తాకుతూ ఉంటుంది. ఆ సుడిగాలి వేగం ఒక హద్దు (సుమారుగా గంటకి 40 మైళ్లు) దాటినప్పుడు దానిని చక్రవాతం (tornado) అంటారు. చక్రవాతానికీ తుపానుకీ ఒక ఉమ్మడి లక్షణం ఉంది; రెండింటి మధ్య ఒక అల్ప పీడన ద్రోణి (low pressure trough) ఉంటుంది.
 
కొన్ని చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి అతి వేగంతో తిరుగుతూ వస్తుంది. గరాటు ఆకారంలో ఉన్న ఆ సుడిగాలి అడుగు భాగం భూమిని తాకుతూ, పై భాగం మేఘాలని తాకుతూ ఉంటుంది. ఆ సుడిగాలి వేగం ఒక హద్దు (సుమారుగా గంటకి 40 మైళ్లు) దాటినప్పుడు దానిని చక్రవాతం (tornado) అంటారు. చక్రవాతానికీ తుపానుకీ ఒక ఉమ్మడి లక్షణం ఉంది; రెండింటి మధ్య ఒక అల్ప పీడన ద్రోణి (low pressure trough) ఉంటుంది.
 
సాధారణంగా తుపాను (cyclone) వచ్చినప్పుడు ఆ గాలి తాకిడికి సముద్రంలో పెద్ద కెరటాలు లేస్తాయి. ఈ కెరటాల వల్ల తీర ప్రాంతాలలో ముంపు కలుగుతుంది: ఈ కెరటాలు భూమి లోపుకి ఎక్కువగా చొచ్చుకుని రావు. గాలివాన, తుపానుల వల్ల కలిగే నష్టం ముఖ్యంగా గాలి వల్ల, కొంత వరకు వాన వల్ల; సముద్రపు కెరటాల వల్ల కాదు. హుద్ హుద్ వల్ల విశాఖ ప్రాంతాలకి కలిగిన నష్టం ఇటువంటిదే.
 
==టైడల్ వేవు, ఉప్పెన ==
 
అమెరికాలో, 1960 దశకంలో, “టైడల్ వేవ్” (tidal wave) అన్న మాటే వాడుకలో ఉండేది. సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 తరువాత కనబడడం మొదలుపెట్టింది. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించడంతో అప్పటివరకు వాడుకలో ఉన్న “టైడల్ వేవ్” కీ, కొత్తగా ప్రవేశించిన సునామీకి మధ్య తేడా తెలియక కొంత తికమకకి దారి తీసింది.
Line 50 ⟶ 48:
 
ప్రతి తరంగానికి పొడుగు (wavelength), డోలన వ్యాప్తి లేక ప్రవర్ధమానం లేక ఎత్తు (amplitude) ఉంటాయి. సాధారణంగా సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే ఈ ఎత్తు సుమారు రెండో, మూడో మీటర్లు ఉంటుంది. పొడుగు మహా ఉంటే 50 మీటర్లు ఉండొచ్చు. కాని ఇది సునామీ అయితే ఆ కెరటం ఎత్తు సుమారు 10 మీటర్లు (30 అడుగులు), పొడుగు సుమారు 15 కిలోమీటర్లు ఉండొచ్చు.
 
 
సునామీ సముద్రం మధ్యలో ఎక్కడో పుట్టి గంటకి సుమారు 500 కిలోమీటర్ల వేగంతో (అంటే విమానం వేగంతో) ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎదట గర్త, దాని వెనక శిఖ ఉంటాయి కనుక ఒడ్డున ఉండి చూసేవాళ్లకి ముందస్తుగా గర్త తగులుతుంది. అందువల్ల సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోతూ కనిపిస్తుంది. దాని వెనక ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో కొండంత ఎత్తు ఉన్న శిఖ జోరుగా వస్తోందన్న విషయం ఒడ్డున ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అమాయకంగా సముద్రం ఎందుకు వెనక్కి తగ్గిపోతోందా అని ఆశ్చర్యపడి కళ్లప్పగించి చూస్తూ ఉంటాడు. ఆ వెనక నుండి విమానం జోరుతో వస్తూన్న శిఖ ఒడ్డు చేరుకోడానికి 2 నిమిషాలు కూడ పట్టదు. ఆ వచ్చే కెరటం ఎత్తు 10 మీటర్లు అనుకుంటే నీటి మట్టం క్షణానికి 8 సెంటీమీటలు (2 అంగుళాలు) చొప్పున పెరుగుతుంది అన్నమాట. అంటే ఇరవై అంకెలు లెక్కపెట్టే లోగా నిలువెత్తు మనిషి ములిగి పోతాడు. కనుక ప్రాణం మీద ఆశ ఉంటే సముద్రం తీతని చూడగానే కాలికి బుద్ధి చెప్పో, కారు ఎక్కో, ఎత్తయిన ప్రదేశానికి పారిపోవాలి.
Line 59 ⟶ 56:
ముక్తాయింపుగా, నిర్దిష్టత కొరకు ఈ దిగువ కొన్నినిర్వచనాలు:
 
* టైడల్ వేవ్ ని తెలుగులో ఉప్పెన అందాం. ఉప్పెన అంటే సముద్రపు పోటుకి తుపాను తోడయినప్పుడు సముద్రపు మట్టం బాగా పెరిగి, సముద్రం చెలియలికట్టని దాటి, పల్లపు భూములని ముంచేయడం. ఇంగ్లీషు మాటలో “వేవ్” అని ఉన్నా ఇది కెరటం కాదు.
 
* పూర్వపు రోజుల్లో టైడల్ వేవ్ అన్నా సునామీ అన్నా ఒకటే అనుకుని వీటిని పర్యాయపదాలుగా వాడేవారు; కాని ఇది సరి కాదు. సునామీకి ఆటుపోట్లకి ఏ విధమైన సంబంధం లేదు.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉప్పెన" నుండి వెలికితీశారు