భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'భారతదేశంలో సైన్యం, గురించిన ప్రస్తావనలు వేల సంవత్సరాలకింద...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ఇండో-ఆర్యన్ల ఋగ్వేద తెగలు, ‘రాజు’ అనిపిలవబడే తమ నాయకుల ఆధ్వర్యంలో, తమలో తాము, ఇతర తెగలతోనూ యుద్ధాలు చేసేవారు. [[ఋగ్వేదం]]లో వర్ణించినట్టు వీరు కంచు ఆయుధాలు, గుఱ్ఱాలు లాగే రథాలు వాడేవారు. యుద్ధం లభించిన ‘కొల్లసొమ్ము’ (ముఖ్యంగా పశుసంపద)లో సింహభాగం తెగనాయకునికి చేరేది. ఈ వీరులందరూ [[క్షత్రియ]] వర్ణానికి చెందినవారు.
ఋగ్వేదానంతర కాలం([[ఇనుప యుగం]]- క్రీ.పూ 1100-500)లో వచ్చిన వేదాలలోనూ, ఇతర సాహిత్యంలోనూ సైన్యం గురించి తొలిప్రస్తావనలు కనిపిస్తాయి. గజబలం యొక్క తొలిప్రస్తావనలు ఈ కాలంనాటివే. <ref>[http://www.history-of-india.net/mahajanapadas.htm ]{{dead link|date=August 2012}}</ref>
భారతదేశపు గొప్ప ఇతిహాసాలైన [[రామాయణం| రామాయణ]], [[మహాభారతం|మహాభారతాలు]], [[మహాజనపదాలుమహా జనపదాలు]] ఏర్పడుతున్న కాలంనాటి సైనికనిర్మాణాలు, యుద్ధరీతులు, ఆయుధాల గురించి వర్ణనలు కలిగి ఉంటాయి. యుద్ధ రథాలు, గజబలాలు, వైమానిక దళాల గురించి కూడా వర్ణనలు ఉన్నాయి. [[మహాభారతం]]లో యుద్ధవ్యూహాలు ([[పద్మ వ్యూహం]], [[క్రౌంచ వ్యూహం]] ఇత్యాది) గురించి కూడా వర్ణనలున్నాయి.
==మగధ రాజ్యాలు==
 
పంక్తి 34:
క్రీ.పూ 180 సంవత్సరంలో, బాక్ట్రియా దేశపు ఇండో-గ్రీకు రాజు దెమెత్రియస్-1 కాబూల్ లోయ ని ఆక్రమించడమే కాక, సింధు ప్రాంతాన్ని కూడా తన ఏలుబడిలోనికి తెచ్చుకున్నాడు. మరో ఇండో-గ్రీకు రాజు మెనాండర్, ఇతర భారతీయ రాజులతో కలిసి (లేదా కలుపుకుని) [[పాట్నా|పాటలీపుత్రం]] పైన దండయాత్ర చేసాడు. ఈ దండయాత్ర జరిగిన క్రమం, జయపజయాలు గురించి సమాచారం లేదు.
 
ఇండో-గ్రీకు రాజ్యంతో శుంగవంశపు యుద్ధాలు, చరిత్రలో గొప్పగా వర్ణించబడ్డాయి. వీరు [[శాతవాహనులు|శాతవాహనుల]]తోనూ, [[కళింగులు|కళింగుల]]తోనూ, ఇండో-గ్రీకులతోనూ (మథురులు, పాంచాలురు) యుద్ధాలు చేసినట్టు ఆధారాలున్నాయి. [[పుష్యమిత్రుడు]] రెండు అశ్వమేధ యజ్ఞాలను చేసినట్టు తెలుస్తున్నది. శుంగ సామ్రాజ్యపు శాసనాలు [[జలంధర్]] లో కూడ లభించాయి.
పంజాబ్ (పాకిస్తాన్) లోని, [[సియాల్ కోట్]] వరకు వీరి పాలన విస్తరించినట్టు ఆధారాలు ఉన్నాయి. మగధ సామ్రాజ్యం గతంలో కోల్పోయిన [[మధుర]]ని, క్రీ.పూ100 సంవత్సరంలో శుంగుల పాలనలోకి వచ్చింది.
 
పంక్తి 116:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{భారతదేశానికి సంభందించిన అంశాలు}}
 
[[వర్గం:భారత రక్షణ వ్యవస్థ]]