ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రత్యేకత: లంకె సరి చేసేను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Eemani01.jpg|thumbnail|200px|ఈమని శంకరశాస్త్రి]]
'''ఈమని శంకరశాస్త్రి''' ([[సెప్టెంబర్ 23]], [[1922]] - [[డిసెంబర్ 23]], [[1987]]) ప్రముఖ వీణ విద్వాంసుడు. ఈయన [[ద్రాక్షారామం]]లో జన్మించాడు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప [[వీణ]] విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను [[సితార్‌సితార్]] లాగా నిలువుగా పట్టుకుని వాయించేవాడు. ([[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] చిన్నవయస్సులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫొటోలో పక్క వాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది) శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నాడు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. [[కాకినాడ]] [[పిఠాపురం రాజా కాలేజీ]]లో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో [[తిరుచ్చి]] రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది.
==నేపధ్యము==
వీరు తమ తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదంలో అతి సున్నితంగాను, అతి గభీరంగాను... రెండువిధాలుగానూ ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలితసంగీతం, శాస్త్రీయ సంగీతం... రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరువాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు.
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు