భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
 
[[File:QtubIronPillar.JPG|thumb|వాహిలకులని ఓడించిన అనంతరం చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేయించిన ఇనుప స్థంభం ([[ఢిల్లీ]]లోని [[కుతుబ్ మీనార్]] వద్ద)]]
గుప్తులకాలంనాటి సైన్యం రూపురేఖలని '''శివ ధనుర్వేదం''' వర్ణిస్తుంది. గుప్తులు యుద్ధగజాలపైన ఎక్కువగా ఆధారపడ్డారు. గుఱ్ఱాల వినియోగం తగ్గించారు. యవనులపైన, శకులపైన, ఇతర ఆక్రమణదారులపైన యుద్ధాలలో కలసిరాకపోవడం వల్ల, రథాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గదలు, కొరడాలతో ఆయుధాలుగా కలిగి, రింగుల కవచాలు ధరించిన కాల్బలం భారీసంఖ్యలో, గుప్తుల సైన్యంలో ఉండేది. శత్రువులపైన వీరు మెరుపుదాడులు చేసేవారు. వీరి కాల్బలంలో, విలుకాండ్రు కూడా ఉండేవారు. వెదురు బొంగు గానీ లోహాలతో చేసిన వింటిని ధరించేవారు. వెదురు బొంగు, లోహపు మొనలతో కూడిన బాణాలను సంధించేవారు.శత్రుగజాలపైన ఇనుప కమ్మీలను ప్రయోగించేవారు. అప్పుడప్పుడు నిప్పు చుట్టిన బాణాలు (ఆగ్నేయాస్త్రాలు) కూడా ప్రయోగించేవారు. విలుకాండ్రని పరిరక్షిస్తూండే కాల్బలం కవచాలు, బల్లేలు, పొడవాటి కత్తులు ధరించేవారు. ప్రాదేశిక జలాలను పరిరక్షించడానికి, గుప్తుల నావికాబలగం ఉండేది.
 
[[సముద్రగుప్తుడు]] సింహాసనాన్ని అధిష్టించిన తొలినాళ్లలో, షిచ్ఛత్ర పద్మావతి రాజ్యాలను ఆక్రమించాడు. అనంతరం కోట రాజ్యాన్ని కలుపుకుని మాళవ, యౌధేయ, అర్జునయన, మదుర, అభీరులపైన దాడి చేసాడు. విచ్ఛిన్న కుషాణు సామ్రాజ్యపు సామంతులను నియంత్రించాడు. క్రీ.శ 380 లో సముద్రగుప్తుడు, మరణించేనాటికి 20 రాజ్యాలను ఆక్రమించాడు.
 
చంద్రగుప్తుడు-2, భారతదేశానికి వెలుపల లోపల ఉన్న 21 రాజ్యాలను ఆక్రమించాడని, క్రీ.శ 4వ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి [[కాళిదాసు]] పొగిడాడు.తూర్పు పడమర దిగ్విజయ యాత్రలని పూర్తి చేసిన అనంతరం సముద్రగుప్తుడు, ఉత్తరదిశగా కదిలి పారశీకులని అణిచివేసాడు. అటుపైన వక్షు నది (అము దార్యా)కి తూర్పు, పడమరల ఉన్న హూణులను, కాంభోజులను ఓడించాడు. భారత ఉపఖండం మొత్తాన్నీ శాసించిన చంద్రగుపుడు - 2 కాలానికి గుప్తసామ్రాజ్యం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యము.
 
వాయవ్య సరిహద్దులనుండి ఆక్రమణకి వచ్చిన ఇండో-హెప్థలైట్స్ లేదా శ్వేతహూణులను [[స్కంధగుప్తుడు]] నిరోధించాడు. స్కంధగుప్తుడు, తన తండ్రి రాజ్యంలో సైతం హూణులతో యుద్ధాలు చేసి, గొప్ప యోధునిగా పేరుపొందాడు. మళ్ళీ, క్రీ.శ 455లో దురాక్రమణకి వచ్చిన హూణులను నిరోధించాడు. అయితే, మాటిమాటికీ ఆక్రమణలు, వాటిని నిరోధించే యుద్ధాలతో సామ్రాజ్య వనరులన్నీ ఖర్చు అయిపోయి, సామ్రాజ్యపతనానికి కారణమయ్యాయి.
 
==తొలి మధ్యయుగం==