భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
దక్షిణ భారతదేశాన్ని [[చాళుక్యులు]], [[పల్లవులు]] ఒకేకాలంలో ప్రాధాన్యతని పొందారు. చాళుక్య రాజు, [[రెండవ పులకేశి]] సామ్రాజ్య కాంక్షతో సాగించిన దండయాత్రలు అలూపులు, గాంగులపైన విజయాలతో మొదలై; పల్లవ రాజు [[మహేంద్రవర్మన్]] ని ఓడించడమే కాక చేర, పాండ్యులను ఓడించాడు. ఉత్తర భారతదేశం నుండి దండయాత్రకి బయలుదేరిన, హర్షుణ్ణి నిరోధించి, అతని దిగ్విజయ యాత్రలని ఆపుచేసాడు.
 
పల్లవ రాజు [[మహేంద్రవర్మన్]] కొడుకు, [[నరసింహవర్మన్]] తండ్రి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, చాళుక్యుల రాజధాని వాతాపి/బాదామిపై దండెత్తాడు. ఆతని సేనాని పరంజోతి నాయకత్వంలో సాగిన ఈ దండయాత్రలో, [[నరసింహవర్మన్]] చాళుక్యులని ఓడించి, [[రెండవ పులకేశి]]ని వధించాడు. చాళుక్యుల రాజధాని వాతాపిని ధ్వంసం చేసి, '''వాతాపికొండ''' అనే బిరుదుని పొందాడు. అటుపైన, చాళుక్య-పల్లవుల మధ్య పగలుప్రతీకారాలు శతాబ్దానికిశతాబ్దానికిపైగా సాగాయి. వీరి మధ్య అనేక యుద్ధాలకి [[వేంగి]]దేశం వేదిక అయింది. చివరికి చాళుక్య రాజు, విక్రమాదిత్యుడు-3 క్రీ.శ 740 పల్లవులని పూర్తిగా ఓడించాడు. అటుపైన, క్రీ.శ 750 సంవత్సరంలో వీరి అధికారాన్ని, [[రాష్ట్రకూటులు]] కూలదోసారు. క్రీ.శ 970లో చాళుక్యుల వంశస్థుడు, తైలపుడు - 2, రాష్ట్రకూటుల అధికారాన్ని కూలదోసి, చాళుక్య సామ్రాజ్యాన్ని (గుజరాత్ మినహా) పునరుద్ధరించారు. వీరిని [[కళ్యాణి చాళుక్యులు]] అని కూడా పిలుస్తారు. అధికారం కోసం వీరు, [[చోళులు]]తో పోటిపడ్డారు.
 
===చోళ సామ్రాజ్యం===