మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
1969 [[ఫిబ్రవరి 28]] న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో '''తెలంగాణా ప్రజాసమితి''' ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా [[మార్చి 3]] న తెలంగాణా బందును జరిపింది.
[[బొమ్మ:Marri Chennareddy.jpg|thumb|right|ఉద్యమాన్ని రాజకీయం చేసిన [[కాంగ్రేసు పార్టీ]] నాయకుడు [[మర్రి చెన్నారెడ్డి]]]]
మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న [[మర్రి చెన్నారెడ్డి]] కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. [[మే 1]] - '''మేడే''' నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. [[మే 15]] న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. [[వందేమాత్రంవందేమాతరం రామచంద్రరావు]], [[బద్రివిశాల్ పిట్టి]] వీరిలో ఉన్నారు.