భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
 
===చోళ సామ్రాజ్యం===
[[File:Battle of kedah.jpg|thumb|left| భీమసేనుని కేదాహ్ ముట్టడి యొక్క ఊహాచిత్రం]]
 
భారత ఉపఖండ పాలకులలో, దండయాత్రలకి సామ్రాజ్యవిస్తరణకి నావికాబలగాన్ని వాడిన మొట్టమొదటి పాలకులు, [[చోళులు]]. [[విజయాలయ చోళుడు]] పల్లవులను ఓడించి, [[తంజావూరు]]ని స్వాధీనం చేసికొన్నాడు. క్రీ.శ 10వ్1 శతాబ్ది తొలినాళ్లలో, చోళరాజు '''పరాంతకుడు-1''', పాండ్యరాజు '''మారవర్మ రాజసింహ-2'''ని ఓడించి, [[శ్రీలంక]]పైన దండెత్తాడు. అయితే, అతని కుమారుడు '''రాజాదిత్యుడు''', క్రీ.శ 949లో రాష్ట్రకూట పాలకుడు మూడవ కృష్ణుని చేత ఓడింపబడి, వధింపబడ్డాడు.
 
క్రీ.శ 970-85లో పరిపాలించిన ఉత్తమ చోళుని పరిపాలనాకాలంలో సైనికులు, నడుముకి కిందివరకు కవచపు కోటులని ధరించినట్టు శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. అనంతరం వచ్చిన రాజరాజ చోళుడు, కండలూరు యుద్ధం నుండి దండయాత్రలని ప్రారంభించాడు. విలీనం పట్టణాన్ని, శ్రీలంకలో కొంత భాగాన్ని పరిపాలిస్తున్న అమర భుజంగుడనే పాండ్య రాజుని బంధించాడు. పాలనకి వచ్చిన 14వ యేట, మైసూరు గాంగులని, [[బళ్లారి]] తూర్పు మైసూరులని ఏలుతున్న నోళంబులని, తాడగైపాడి, [[వేంగి]], [[కూర్గ్]] లను, దక్షిణాపథాన్ని ఏలుతున్న చాళుక్యుల రాజ్యాలను ఆక్రమించాడు. తరువాతి మూడేళ్లలో, కుమారుడు రాజేంద్ర చోళుడు -1 సాయంతో, కొల్లం రాజ్యాన్ని, ఉత్తరాన [[కళింగ]] దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అటుపైన, రాజేంద్ర చోళుడు -1, శ్రీలంకని పూర్తిగా అక్రమించడమేకాక ఉత్తరాన [[గంగా]] నది దాటి రాజ్య విస్తరణ చేసి '''గంగైకొండ'''అనే బిరుదుని ధరించాడు. [[కళింగ]] గుండా [[బెంగాల్]] వరకు దిగ్విజయయాత్ర చేసాడు. తన దిగ్విజయ యాత్రకి గుర్తుగా క్రీ.శ 1025సంవత్సరంలో '''గంగైకొండచోళపురం''' అనే కొత్త రాజధాని నగరాన్ని కట్టించాడు. సుమారు 250 సంవత్సరాలపాటు ఈ నగరం దక్షిణభారతదేశాన్ని శాసించింది. రాజేంద్ర చోళుడు దండయాత్రకి పంపిన భారీ నావికాదళం, తన నావికాదండయాత్రలో [[జావా]], [[మలేసియా]], [[సుమత్రా]] దీవులని ఆక్రమించింది. చోళుల అనంతరం, పడమరన హోయసాలులు, దక్షిణాన పాండ్యులు స్వతంత్రులైనారు.
 
===రాష్ట్రకూటులు===
===సింధుపై అరబ్బుల దాడి===