జోస్యం జనార్దనశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''జోస్యం జనార్దనశాస్త్రి''' రాయలసీమకు చెందిన కవిపుంగవులలో ప్రముఖుడు.
==జీవిత విశేషాలు==
జోస్యం జనార్దనశాస్త్రి [[కర్నూలు జిల్లా]], [[పాణ్యం]]లో [[1911]], [[అక్టోబరు 2]]వ తేదీకి సరియైన [[విరోధికృతు]] నామ సంవత్సర [[ఆశ్వయుజ శుద్ధ దశమి]] నాడు అన్నపూర్ణమ్మ, వేంకటరామయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు ములకనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. కౌండిన్యస గోత్రజుడు. ఇతని తల్లిదండ్రులు ప్రాచీనార్షసాంప్రదాయానికి చెందిన సాత్వికులు. ఇతడు ప్రాథమిక విద్యను 12 సంత్సరములలో ముగించి మేనమామల వద్ద పూర్వపద్ధతులలో సంస్కృతాంధ్రములలో కావ్యనాటక అలంకారములను నేర్చుకున్నాడు. ఇతడు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు వ్రాసినప్పుడు ఇతనికి 'మంత్రి త్రయము' అనే పాఠ్యగ్రంథం ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఈ మంత్రి త్రయం వ్రాసింది ఇతడే. 1933లో ఇతడు [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటి నుండి [[అనంతపురం జిల్లా]], [[తాడిపత్రి]]లోని మునిసిపల్ హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా అనేక సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశాడు. తరువాత కూడా [[తాడిపత్రి]]లోనే స్థిరపడ్డాడు. ఇతడు ప్రైవేటుగా 1942లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు వ్రాసినప్పుడు ఇతనికి 'మంత్రి త్రయము' అనే పాఠ్యగ్రంథం ఉపవాచకంగా ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఈ మంత్రి త్రయం వ్రాసింది ఇతడే. మరో విశేషం ఏమిటంటే ఈ పరీక్షను ఇతనితోబాటు ఇతని కుమార్తె సుబ్బలక్ష్మమ్మకూడా అదే సంవత్సరం వ్రాసింది. ఇతడు 20కి పైగా రచనలు చేశాడు. నాలుగు అష్టావధానాలు కూడా చేసి పండితుల మెప్పు పొందాడు. ఇతని కుమారుడు [[జోస్యం విద్యాసాగర్]] కూడా రచయితగా పేరుగడించాడు. జోస్యం జనార్దనశాస్త్రి తన 82 యేట [[పింగళ]] నామ సంవత్సర [[మార్గశిర బహుళ ద్వాదశి]]నాడు అనగా [[1997]], [[డిసెంబరు 25]]వ తేదీన తాడిపత్రిలో మరణించాడు.
 
==సత్కారాలు==