"రుక్మిణీదేవి అరండేల్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
'''రుక్మిణీదేవి అరండేల్''' (Rukmini Devi Arundale) [[తమిళనాడు]]లోని [[చెన్నై]]లో '''కళాక్షేత్ర''' నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, [[భరతనాట్యం|భరతనాట్యాల]]లో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.
 
== జననం ==
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్]]
ఈమె [[1904]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతాన్ని]] అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే [[దివ్యజ్ఞాన సమాజం]] (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.
 
== వివాహం ==
 
== నాట్య పాఠశాల ఆరంభం ==
[[ఐర్లాండ్]] కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేమ్స్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ఈ నాట్య పాఠశాల "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" అనే పేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. తరువాత కాలంలో అదే ''[[కళాక్షేత్రం]]''గా రూపుదిద్దుకుంది.
 
== పాఠశాల నిర్వహణ ==
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవలం నలుగురే. ఈ పాఠశాలలో [[నాట్యము|నాట్యమే]] కాక [[సంగీతము|సంగీతమూ]] నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.
 
==రాజ్యసభలో==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/178726" నుండి వెలికితీశారు