"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

ఆర్యుల వేద కాలంలో యూదుల మతము (Judaism) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు (Jews)కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంధాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. నేడు హిందువులు తమ దేవతలని సంతృప్తి పరచడం కోసం జంతువులను బలి ఇస్తున్నట్లుగా ఆ కాలంలో యూదులు కూడా పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు , కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అయితే ఆర్యుల వేదకాలంనాటి పాత నిబంధనలో భాగమైన యోషయా గ్రంథం 7:14 లో "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును" అని యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. మరియూ యోషయా 9:6 లో "ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" అని కూడా వ్రాయబడియుంది.
 
"యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు (భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్ధము) అను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పాఅల్లికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను" అని క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18 - 25 చెబుతున్నది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1787366" నుండి వెలికితీశారు