పట్నం సుబ్రమణ్య అయ్యరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పట్నం సుబ్రమణ్య అయ్యరు''' (జననం 1845, మరణం జూలై 31 1902) [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీత]] వాగ్గేయకారుడు. ఈయన [[త్యాగరాజు|త్యాగరాజ స్వామి]] సాంప్రదాయాన్ని అనుసరించారు. దాదాపు ఒక వంద దాకా కీర్తనలను వ్రాసారు.
==జననం - బాల్యం ==
సుబ్రమణ్య అయ్యరు తమిళనాడుకు[[తమిళనాడు]]కు చెందిన [[తంజావూరు]] జిల్లా తిరువయ్యారులో పుట్టారు. వీరి కుటుంబానికి గొప్ప సంగీత నేపధ్యం ఉంది. వీరి తండ్రి భారతం వైద్యనాథ అయ్యరు సంగీతం-శాస్త్రమూ రెండిటిలో ఉద్దండులు. వీరి పితామహులు పంచానంద శాస్త్రి తంజావూరు సెర్ఫోజీ మహారాజా ఆస్థానంలో ఆస్థాన సంగీతకారుడు. సుబ్రమణ్య అయ్యరు సంగీతాన్ని మొదటి వారి మామయ్య మేలత్తూర్ గణపతి శాస్త్రి వద్ద తదుపరి మనంబుచవాది వేంకటసుబ్బయ్యర్ వద్ద నేర్చుకున్నారు.
సుబ్రమణ్య అయ్యరు చాలా యేళ్ళు చెన్నపట్నం(చెన్నై)లో ఉన్నారు. అందువలన ఆయన ఇంటిపేరుగా పట్నం స్థిర పడిపోయి, ఆయన పట్నం సుబ్రమణ్య అయ్యరు గానే పిలవబడ్డారు. ఈయన శిష్యులలో ప్రముఖ వాగ్గేయకారులు, గాయకులు ఉన్నారు. వీరిలో ముఖ్యులు మైసూరు వాసుదేవాచార్, పూచి శ్రీనివాస అయ్యంగార్, భైరవి కెంపెగౌడ, టైగర్ వరదాచార్యర్ తదితరులు.
 
==రచనలు==
సుబ్రమణ్య అయ్యరు వ్రాసిన కృతులలో ''కదనకుతూహల రాగం''లో రచించిన '''[[రఘువంశ సుధా]]''' మరియు ''అభోగి రాగం''లో రచించిన '''ఎవరి బోధన'''. ఈయన వీరి గురువు మకుటం వేంకటేశ కొద్దిపాటి తేడాతో వాడారు. వీరి కృతులు తెలుగు, సంస్కృతంలో ఉన్నాయి. మైసూరు రాజు చామరాజ వొడెయారు ఈయన సంగీత కచేరీ గాత్రానికి మెచ్చి రెండు వేరు వేరు సందర్భాలలో స్వర్ణ కంకణంతో సత్కరించారు.