"భారతదేశ సైనిక చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

 
===మొఘల్ సామ్రాజ్యం===
 
చివరి ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోధీ ని ఓడించి, క్రీ.శ 1526 సంవత్సరంలో స్థానంలో నెలకొల్పబడిన మొఘల్ సామ్రాజ్యం, ఇంచుమించుగా దక్షిణాసియా ప్రాంతం మొత్తాన్నీ పరిపాలించింది. తూర్పున బెంగాల్ నుండి పడమరన [[కాబూల్]] వరకూ, ఉత్తరాన కాశ్మీరు నుండి దక్షిణాన కావేరి వరకూ ఉన్న విశాల భూభాగం మొఘలుల ఏలుబడిలో ఉండినది. ,<ref>{{cite web |url=http://sun.menloschool.org/~sportman/westernstudies/first/1718/2000/eblock/mughal/ |archiveurl=https://web.archive.org/web/20080225145650/http://sun.menloschool.org/~sportman/westernstudies/first/1718/2000/eblock/mughal/ |archivedate=2008-02-25 |title=Mughal Empire}}</ref> సామ్రాజ్య జనాభా 11 నుండి 13 కోట్లు ఉండి ఉంటుందని అంచనా <ref>John F Richards, [http://www.amazon.com/dp/0521566037/ ''The Mughal Empire''], Vol I.5, ''New Cambridge History of India'', Cambridge University Press, 1996</ref> క్రీ.శ 1540 సంవత్సరంలో, మొఘల్ చక్రవర్తి [[హుమయూన్]], [[షేర్ షా సూరి]] చేత ఓడింపబడి [[కాబూల్]] కి పారిపోయాడు. [[షేర్ షా సూరి]] మరణానంతరం క్రీ.శ 1555 సంవత్సరంలో అస్థిరమైన సూరి సామ్రాజ్యాన్ని, సికిందర్ సూరిని ఓడించి [[హుమయూన్]] తిరిగి పొందాడు.
 
మొఘలుల ప్రాభవం [[అక్బరు]] పరిపాలన నుండి ప్రారంభమై, క్రీ.శ 1707లో [[ఔరంగజేబు]]మరణంతో అంతమైంది. <ref>{{cite web|url=http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_1.shtml |title=Religions - Islam: Mughal Empire (1500s, 1600s) |publisher=BBC |date=7 September 2009 |accessdate=2012-03-14}}</ref><ref>{{cite web|url=http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_5.shtml |title=Religions - Islam: Mughal Empire (1500s, 1600s) |publisher=BBC |date=7 September 2009 |accessdate=2012-03-14}}</ref>. అటుపైన మరో 150 సంవత్సరాలు వంశపాలన సాగినప్పటికీ, మునుపటి సామర్థ్యం, తదుపరి పాలకులకి లేవు. మొఘలుల కాలంలో కేంద్రీకృత పరిపాలన, క్రియాశీలకంగా ఉండింది. క్రీ.శ 1725 అనంతరం యుద్ధాల వలన, కరువుకాటకాల వలన, స్థానిక తిరుగుబాట్ల వలన, విపరీతమైన పరమత ద్వేషం వలన, మరాఠాల విజృంభణ వలన, చివరి బ్రిటీషు వలసపాలన వలన మొఘలుల పాలన అంతమైంది. చివరి మొఘలు పాలకుడు బహదూర్ షా , 1857 తిరుగుబాటు అనంతరం బ్రిటీషువారు విధించిన దేశబహిష్కరణ శిక్షకి గురైనాడు.
====హేమచంద్రుడు====
 
సూరి సామ్రాజ్య సైన్యంలో సాధారణ సైనికునిగా జీవితం ప్రారంభంచిన హేమచంద్రుడు లేదా '''హేమూ''' క్రీ.శ 1552 నాటికి పంజాబు గవర్నరుగా నియమింపబడ్డాడు. అటుపైన, సూరి సామ్రాజ్యంపైన తిరుగుబాటు చేసిన బెంగాల్-ఆఫ్ఘన్ సేనలను అణిచివేసి, బెంగాలు గవర్నరుగా ఉండిన సమయంలో, అదిల్ షా సూరిని ఓడించి, మొగల్ చక్రవర్తి [[హుమయూన్]] ఢిల్లీని ఆక్రమించాడు. క్రీ.శ 1556 సంవత్సరంలో హుమయూన్ మరణానంతరం, అదే అదునుగా భావించి బెంగాలునుండి ఆఫ్ఘన్ , భారతీయ సేనలతో తన దండయాత్రలని ప్రారంభంచాడు. 22 వరుస యుద్ధాలలో ఓటమినెరుగని '''హేమూ''' [[బీహార్]], ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో అనేక బలమైన దుర్గాలను ఆక్రమించడమే కాక, కీలకమైన [[ఆగ్రా]] కోటనీ, చివరగా క్రీ.శ 1556 అక్టోబరు 6న [[ఢిల్లీ]] కోటనీ ఆక్రమించాడు. క్రీ.శ 1556 అక్టోబరు 7న ఢిల్లీ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై, '''విక్రమాదిత్య''' అనే నామాన్ని ధరించాడు. కేవలం నెలరోజులు మాత్రమే ఢిల్లీ చక్రవర్తిగా ఉండిన '''హేమూ''', క్రీ.శ 1556 నవంబరు 6న రెండవ పానిపట్టు యుద్ధం లో ఓడింపబడి, [[అక్బరు]] సంరక్షకుడైన భైరాం ఖాన్ చేత వధింపబడ్డాడు.
 
<gallery>
Emperor babur.jpg|మొఘలు వంశస్థాపకుడు [[బాబర్]]
The Adventures of Akbar artillery.jpg|[[అక్బరు]] యొక్క ఫిరంగి దళం
Officer of the Mughal Army, c.1585 (colour litho).jpg| మొఘలుల సైనికాధికారి
Maharaja Hemu Bhargava - Victor of Twenty Two Pitched Battles, 1910s.jpg|విక్రమాదిత్యునిగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన హేమచంద్రుడు
The defeat of Hemu, Akbarnama.jpg|హేమచంద్రుని ఓటమి గురించి, అక్బర్ నామాలోని చిత్రలేఖనం
Statue of Hem Chandra Vikramaditya at Panipat.JPG|హరియాణలోని పానిపట్టు వద్ద హేమచంద్ర విక్రమాదిత్య యొక్క విగ్రహం
Aurangzeb au siège de Satara.jpg|[[ఔరంగజేబు]] నాయకత్వంలో మరాఠాలతో సతరా వద్ద యుద్దం చేస్తున్న మొఘల్ సేనలు
</gallery>
 
===మరాఠా సామ్రాజ్యం===
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789490" నుండి వెలికితీశారు