భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
====హేమచంద్రుడు====
 
సూరి సామ్రాజ్య సైన్యంలో సాధారణ సైనికునిగా జీవితం ప్రారంభంచిన హేమచంద్రుడు లేదా '''హేమూ''' క్రీ.శ 1552 నాటికి పంజాబు గవర్నరుగా నియమింపబడ్డాడు. అటుపైన, సూరి సామ్రాజ్యంపైన తిరుగుబాటు చేసిన బెంగాల్-ఆఫ్ఘన్ సేనలను అణిచివేసి, బెంగాలు గవర్నరుగా ఉండిన సమయంలో, అదిల్ షా సూరిని ఓడించి, మొగల్ చక్రవర్తి [[హుమయూన్]] ఢిల్లీని ఆక్రమించాడు. క్రీ.శ 1556 సంవత్సరంలో హుమయూన్ మరణానంతరం, అదే అదునుగా భావించి బెంగాలునుండి ఆఫ్ఘన్ , భారతీయ సేనలతో తన దండయాత్రలని ప్రారంభంచాడు. 22 వరుస యుద్ధాలలో ఓటమినెరుగని '''హేమూ''' [[బీహార్]], ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో అనేక బలమైన దుర్గాలను ఆక్రమించడమే కాక, కీలకమైన [[ఆగ్రా]] కోటనీ, చివరగా క్రీ.శ 1556 అక్టోబరు 6న [[ఢిల్లీ]] కోటనీ ఆక్రమించాడు. క్రీ.శ 1556 అక్టోబరు 7న ఢిల్లీ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై, '''విక్రమాదిత్య''' అనే నామాన్ని ధరించాడు. కేవలం నెలరోజులు మాత్రమే ఢిల్లీ చక్రవర్తిగా ఉండిన '''హేమూ''', క్రీ.శ 1556 నవంబరు 6న [[రెండవ పానిపట్టు యుద్ధం ]]లో ఓడింపబడి, [[అక్బరు]] సంరక్షకుడైన భైరాం ఖాన్ చేత వధింపబడ్డాడు.
 
<gallery>
600

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789497" నుండి వెలికితీశారు