"సురవరం ప్రతాపరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

 
==రచనా వ్యాసంగం ==
సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా [[పాలమూరు జిల్లాకుజిల్లా]]కు చెందిన 87 కవుల వివరాలున్నాయి.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, ఆచార్య [[ఎస్వీ రామారావు]] రచన, సెప్టెంబరు 2012, పేజీ 10</ref> ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ''[[ఆంధ్రుల సాంఘిక చరిత్ర]]''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. ''సురవరం ప్రతాపరెడ్డి కథలు'' నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. ''హైందవ ధర్మ వీరులు'', ''[[హిందువుల పండుగలు]]'', ''రామాయణ కాలం నాటి విశేషాలు'' మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. ''[[భక్త తుకారాం]]'', ''ఉచ్ఛల విషాదము'' అనే నాటకాలు రాసాడు. రాజకీయ సాంఘీక ఉద్యమంగా సంచలనం కలిగించిన [[ఆంధ్రమహాసభ]] మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.
 
==రాజకీయాలు==
సురవరంకు రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిననూ సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై విజయం సాధించి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. కాని ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్ననూ ఇతనికి మంత్రిపదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా ఆయన ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.
5,722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789877" నుండి వెలికితీశారు