భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
క్రీ.శ 970-85లో పరిపాలించిన ఉత్తమ చోళుని పరిపాలనాకాలంలో సైనికులు, నడుముకి కిందివరకు కవచపు కోటులని ధరించినట్టు శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. అనంతరం వచ్చిన రాజరాజ చోళుడు, కండలూరు యుద్ధం నుండి దండయాత్రలని ప్రారంభించాడు. విలీనం పట్టణాన్ని, శ్రీలంకలో కొంత భాగాన్ని పరిపాలిస్తున్న అమర భుజంగుడనే పాండ్య రాజుని బంధించాడు. పాలనకి వచ్చిన 14వ యేట, మైసూరు గాంగులని, [[బళ్లారి]] తూర్పు మైసూరులని ఏలుతున్న నోళంబులని, తాడగైపాడి, [[వేంగి]], [[కూర్గ్]] లను, దక్షిణాపథాన్ని ఏలుతున్న చాళుక్యుల రాజ్యాలను ఆక్రమించాడు. తరువాతి మూడేళ్లలో, కుమారుడు రాజేంద్ర చోళుడు -1 సాయంతో, కొల్లం రాజ్యాన్ని, ఉత్తరాన [[కళింగ]] దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అటుపైన, రాజేంద్ర చోళుడు -1, శ్రీలంకని పూర్తిగా అక్రమించడమేకాక ఉత్తరాన [[గంగా]] నది దాటి రాజ్య విస్తరణ చేసి '''గంగైకొండ'''అనే బిరుదుని ధరించాడు. [[కళింగ]] గుండా [[బెంగాల్]] వరకు దిగ్విజయయాత్ర చేసాడు. తన దిగ్విజయ యాత్రకి గుర్తుగా క్రీ.శ 1025సంవత్సరంలో '''[[గంగైకొండచోళపురం]]''' అనే కొత్త రాజధాని నగరాన్ని కట్టించాడు. సుమారు 250 సంవత్సరాలపాటు ఈ నగరం దక్షిణభారతదేశాన్ని శాసించింది. రాజేంద్ర చోళుడు దండయాత్రకి పంపిన భారీ నావికాదళం, తన నావికాదండయాత్రలో [[జావా]], [[మలేసియా]], [[సుమత్రా]] దీవులని ఆక్రమించింది. చోళుల అనంతరం, పడమరన హోయసాలులు, దక్షిణాన పాండ్యులు స్వతంత్రులైనారు.
 
===గుర్జర-ప్రతీహారులు రాష్ట్రకూటులు===
 
[[File:Statue of Gurjar Samraat Mihir Bhoj Mahaan in Bharat Upvan ofAkshardham Mandir New Delhi.jpg|thumb| గుర్జర-ప్రతీహార పాలకుడు మిహిరభోజుడు]]
 
క్రీ.శ 9వ శతాబ్దానికి చెందిన [[రాష్ట్రకూట ]] చక్రవర్తి, ప్రపంచంలో నాలుగు శక్తివంతమైన రాజులలో ఒకడని, అరబ్ పండితుడు సులేమాన్ వర్ణించాడు.<ref>A Comprehensive History Of Ancient India (3 Vol. Set) by P.N Chopra p.203</ref>
క్రీ.శ 9వ శతాబ్దంలో, దేవపాలుడు, గుర్జర-ప్రతీహారులపైన దాడిచేశాడు. మిహిరభోజుని నాయకత్వాన ప్రతీహారులు వారి సామంతులు నారాయణపాలుని ఓడించారు.
 
గుర్జర-ప్రతీహార రాజు భోజునికి రాష్ట్రకూట రాజు కృష్ణుడు-2 కి మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాతికాలంలో రాష్ట్రకూట రాజు, ఇంద్రుడు-3 కనౌజ్ పైన దాడిచేసినపుడు మహిపాలుడు పలాయనం చిత్తగించాడు.
 
క్రీ.శ915 సంవత్సరం మహిపాలుని పాలనలో 8లక్షలుగా ఉన్న గుర్జర-ప్రతీహార సైన్యం, ప్రతీహారులు దక్షిణాన రాష్ట్రకూటులతోనూ, పశ్చిమాన ముస్లింలతోనూ యుద్ధంలో మునిగి ఉన్నట్టు అల్-మసౌది రచనల ద్వారా తెలుస్తున్నది.
 
===సింధుపై అరబ్బుల దాడి===