"భారతదేశ సైనిక చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

 
===రాజపుత్రులు===
[[File:RajaRaviVarma MaharanaPratap.jpg|thumb|right|మేవార్ పాలకుడు రాణా ప్రతాప్ సింగ్]]
 
ఇబ్రహీం లోధీపైన [[బాబర్]] విజయానంతరం, [[మేవార్]] పాలకుడు '''రాణా సాంగా''' లేదా రాణా సంగ్రాం సింగ్, సుమారు 20,000వేలమంది రాజపుత్ర కూటమి సైన్యంతో [[బాబర్]] నుండి ఢిల్లీని జయించేందుకు వచ్చాడు. [[బాబర్]] ఆస్థాన చరిత్రకారుల ప్రకారం, '''రాణా సాంగా''' యొక్క సైన్యం 2లక్షలపైనే. అయితే, పరిమితంగానే ఉన్న మంగోలుల ఫిరంగిదళం ముందు అధికసంఖ్యలో ఉన్న రాజపుత్ర కాల్బలం నిలువలేకపోయింది. ఖణ్వా వద్ద క్రీ.శ 1527 మార్చి 16న జరిగిన ఈ యుద్ధంలొ '''రాణా సాంగా''' [[బాబర్]] చేత ఓడింపబడ్డాయి. భారతీయ సైనిక చరిత్ర, ఫిరంగుల ఉపయోగం యుద్ధఫలితాన్ని నిర్ణయించిన మొదటి యుద్ధంగా ఖణ్వా యుద్ధాన్ని భావిస్తారు. '''రాణా సాంగా''' కుమారుడు రాణా ఉదయ్ సింగ్-2 కాలంలో, [[బాబర్]] మనవడు [[అక్బరు]], మేవార్ల రాజధాని [[చిత్తూర్]] ని ఆక్రమించాడు. మేవార్ పాలకులు, భారతదేశంలో మంగోలుల పాలనని వ్యతిరేకించారు.
 
క్రీ.శ 1576 జూన్ 21న, మేవార్ పాలకుడు [[రాణా ప్రతాప్ సింగ్]] కి, రాజా మాన్ సింగ్, అక్బరు కుమారుడు [[సలీం]] నాయకత్వాన ఉన్న మొఘలుల సైన్యానికి హల్దిఘాటి వద్ద యుద్దం జరిగింది. 80,000 మందిగా ఉన్న మంగోలు సైన్యం ముందు 20,000 రాజపుత్ర సైన్యం నిలువలేకపోయింది. తమ్ముడు శక్తి సింగ్ సహాయంతో, [[రాణా ప్రతాప్ సింగ్]] మొఘలులకి బందీకాకుండా తప్పించుకున్నాడు. అనంతరం, భిల్ల తెగల సహాయంతో, అక్బరు యొక్క మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులు చేసేవాడు.
 
[[రాణా ప్రతాప్ సింగ్]] అనంతరం, అతని కుమారుడు రాణా అమర్ సింగ్, మొఘలులపై యుద్ధాన్ని కొనసాగించాడు. తదుపరి కాలంలో, మొఘల్ చక్రవర్తి జహంగీర్, అమర్ సింగ్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
 
===విజయనగర సామ్రాజ్యం===
[[File:Dutchbisnagar1667.jpg|thumb|ఎడమ|విజయ నగర సైనికులు ధరించే దుస్తులు - డచ్ పెయింటర్ అయిన కార్నెలియస్ హజర్ చిత్రం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1790483" నుండి వెలికితీశారు