"భారతదేశ సైనిక చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

===మొఘల్ సామ్రాజ్యం===
 
చివరి ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోధీ ని ఓడించి, క్రీ.శ 1526 సంవత్సరంలో స్థానంలో నెలకొల్పబడిన మొఘల్ సామ్రాజ్యం, ఇంచుమించుగా దక్షిణాసియా ప్రాంతం మొత్తాన్నీ పరిపాలించింది. తూర్పున బెంగాల్ నుండి పడమరన [[కాబూల్]] వరకూ, ఉత్తరాన కాశ్మీరు నుండి దక్షిణాన కావేరి వరకూ ఉన్న విశాల భూభాగం మొఘలుల ఏలుబడిలో ఉండినది. ,<ref>{{cite web |url=http://sun.menloschool.org/~sportman/westernstudies/first/1718/2000/eblock/mughal/ |archiveurl=https://web.archive.org/web/20080225145650/http://sun.menloschool.org/~sportman/westernstudies/first/1718/2000/eblock/mughal/ |archivedate=2008-02-25 |title=Mughal Empire}}</ref> సామ్రాజ్య జనాభా 11 నుండి 13 కోట్లు ఉండి ఉంటుందని అంచనా <ref>John F Richards, [http://www.amazon.com/dp/0521566037/ ''The Mughal Empire''], Vol I.5, ''New Cambridge History of India'', Cambridge University Press, 1996</ref> క్రీ.శ 1540 సంవత్సరంలో, మొఘల్ చక్రవర్తి [[హుమయూన్]], [[షేర్ షా సూరి]] చేత ఓడింపబడి [[కాబూల్]] కి పారిపోయాడు. క్రీ.శ 1540 నుండి 1566 వరకూ, సూరి వంశస్థులు, వారి సలహాదారు అయిన హిందూ చక్రవర్తి హేమచంద్రుడు పాలించారు. [[షేర్ షా సూరి]] మరణానంతరం క్రీ.శ 1555 సంవత్సరంలో అస్థిరమైన సూరి సామ్రాజ్యాన్ని, సికిందర్ సూరిని ఓడించి [[హుమయూన్]] తిరిగి పొందాడు.
 
మొఘలుల ప్రాభవం [[అక్బరు]] పరిపాలన నుండి ప్రారంభమై, క్రీ.శ 1707లో [[ఔరంగజేబు]]మరణంతో అంతమైంది. <ref>{{cite web|url=http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_1.shtml |title=Religions - Islam: Mughal Empire (1500s, 1600s) |publisher=BBC |date=7 September 2009 |accessdate=2012-03-14}}</ref><ref>{{cite web|url=http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_5.shtml |title=Religions - Islam: Mughal Empire (1500s, 1600s) |publisher=BBC |date=7 September 2009 |accessdate=2012-03-14}}</ref>. అటుపైన మరో 150 సంవత్సరాలు వంశపాలన సాగినప్పటికీ, మునుపటి సామర్థ్యం, తదుపరి పాలకులకి లేవు. మొఘలుల కాలంలో కేంద్రీకృత పరిపాలన, క్రియాశీలకంగా ఉండింది. క్రీ.శ 1725 అనంతరం యుద్ధాల వలన, కరువుకాటకాల వలన, స్థానిక తిరుగుబాట్ల వలన, విపరీతమైన పరమత ద్వేషం వలన, మరాఠాల విజృంభణ వలన, చివరి బ్రిటీషు వలసపాలన వలన మొఘలుల పాలన అంతమైంది. చివరి మొఘలు పాలకుడు బహదూర్ షా , 1857 తిరుగుబాటు అనంతరం బ్రిటీషువారు విధించిన దేశబహిష్కరణ శిక్షకి గురైనాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1790484" నుండి వెలికితీశారు