విటమిన్ ఎ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
విటమిన్ A లోపంవల్ల [[రేచీకటి]], జిరాఫ్తాల్మియా, కెరటోమలేసియా కలుగుతాయి.
[[---విటమిన్ 'ఎ' లోపం వల్ల కలిగే వ్యాధులు]]---
 
¤ రేచీకటి/ నైట్ బ్త్లెండ్‌నెస్/ నిక్టలోపియా: ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు.
 
¤ జీరాఫ్‌థాల్మియా / పొడికళ్లు: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర
(కంజెక్టివా) పొడిగా అవుతుంది.
 
¤ పోషకాహార అంధత్వం: పిల్లల్లో పోషకాహార (విటమిన్ ఎ) లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే శుక్లపటలం (కార్నియా) అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది.
 
¤ చర్మం పొలుసుల్లా, గరుకుగా చిన్న చిన్న సూక్ష్మాంకురాలతో కప్పబడి, గోదురకప్ప చర్మంలా కనిపిస్తుంది.
 
¤ విటమిన్ 'ఎ' లోపం ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుంది.
 
¤ కలర్ బ్త్లెండ్‌నెస్ / వర్ణ దృష్టిలోపం: రెటీనాలోని కోన్‌లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు.
శరీరంలో విటమిన్ 'ఎ'ను 6 నుంచి 9 నెలల వరకు నిల్వచేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ పోషకాహార సంస్థ (NIN, హైదరాబాద్) విటమిన్ 'ఎను పాఠశాలల్లో చదివే పిల్లలకోసం ప్రతి ఆర్నెళ్లకోసారి పెద్దమొత్తాల్లో సరఫరా చేస్తుంది.
 
¤ విటమిన్ 'ఎ'ను 'యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ / జీరాఫ్తాల్మియా నివారక విటమిన్' అని కూడా పిలుస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/విటమిన్_ఎ" నుండి వెలికితీశారు