సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==సిద్ధవటం కోట==
 
పవిత్ర పెన్నానది ఒడ్డున క్రీ.పూ. 40-30 సంవత్సరాల మధ్యకాలంలో సిద్దవటం కోట రూపుదిద్దుకుంది. సుమారు 36 ఎకరాలపైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తకసంఘం వరకూ ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకూ సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకూ ఉన్న మట్టి కోట కాస్తా రాతికట్టడంగా మారింది. క్రీ.శ. 1792లో టిప్పుసుల్తాన్‌ చేతి నుంచి నైజాము నవాబుల పాలనలోకి, వారి నుంచి 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలోకి ఈ కోట చేరింది. బ్రిటిష్‌పాలనలో 1808 నుంచి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా ఉండి, పరిపాలన కేంద్రంగా భాసిల్లింది.
 
ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు