వడ్లమాని విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:సినిమా నటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 2:
'''వడ్లమాని విశ్వనాథం''' నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1912]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలం, [[నందంపూడి]] అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853182 నటరత్నాలు - [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - ఆంధ్రప్రభ వారపత్రిక - 15-03-1972]</ref>. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో [[ఆదిభట్ల నారాయణదాసు]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]]గారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు.
==నాటకరంగం==
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో [[కాకినాడ]] లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధృవ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్బుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు. 1926 నాటికి ప్రమీలార్జునీయం లో ప్రమీల, 'చింతామణి'లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించాడు.
|