రామశర్మ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఉప్పులూరి రామశర్మ''' గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాలలో ప్రవేశించాడు. ఇతనిది కాకినాడ. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించాడు.అందగాడైన రామశర్మ సంభాషణలు చెప్పటంలో సైతం మేటి. కృష్ణకుమారి తొలి చిత్రం 'నవ్వితే రత్నాలు' బిఎన్‌ కళాత్మక చిత్రం బంగారుపాప, సావిత్రితో మేనరికం, ప్రపంచం చిత్రాల్లోనూ నటించారు.<ref>[http://www.visalaandhra.com/movieworld/article-36028 తళుక్కుమని మెరిసి మరుగైన నటులు]</ref>
==జీవిత విశేషాలు==
 
రామశర్మ పూర్తి పేరు "ఉప్పలూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ". ఆ పేరు చాలా పెద్దదిగా ఉందని భావించి సినిమాలలోకి వచ్చిన తర్వాత రామ శర్మగా తన పేరు కుదించుకున్నారు. ఆయన స్వస్టలం పిఠాపురం. అక్కడే హైస్కూల్ వరకూ చదువుకున్నారు. తర్వాత కాకినాడలో గణిత శాస్త్రంలో బి.ఎ. చేశారు.
 
సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలనే కోరికతో బొంబాయి వెళ్లి ఫజల్ బాయి ఇనిస్టిట్యూట్ లో చేరారు. అక్కడ ఉండగానే ఛాయాగ్రాహకుడు బోళ్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన సలహాపై మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశం కోసం చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొంతకాలం చూసి ఇక లాభం లేదనుకుని పిఠాపురం తిరిగివెళ్లి పోయారు రామశర్మ ఆయనలోని ఉత్సాహాన్ని గమనించి వాళ్ల ఊరివాడే అయిన పంతం చిన్నారావు రామశర్మ హీరోగా ఒక సినిమా తీద్దామని ప్రయ త్నించారు కానీ అదీ కుదరలేదు.
 
ఇక అప్పుడు నాటకాలపై దృష్టిని కేంద్రీకరించారు రామశర్మ, ఆ రోజులలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా ముమ్మరంగా ఉండేది. ఆ పార్టీ ಸಿద్దాంతాలతో తను ఏకీభవిస్తూ "సంస్కృతి " అనే నాటికను రాసి దానిని ప్రదర్శించారు. ఆనాటి ఆంధ్రనాటక కళాపరిషత్లో రామశర్మ ప్రదర్శించిన “గౌతము బుద్ధ" నాటకానికి ఎంతో ప్రజాదరణ లభించింది. ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు కురుమద్దాలి రామచంద్రరావు "మంత్రదండం" సినిమా కోసం పిలిపించారు. అలాగే మీర్జాపూరు రాజావారు "తిలోత్తమ" చిత్రంలో హీరో పాత్రకోసం రామశర్మకు మేకప్ టెస్టు చేసారు. అయితే ఆ రెండు సినిమాలలోనూ వేషాలు ఆయనకు దక్కలేదు. ఆ చిత్రాలలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించారు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/రామశర్మ_(నటుడు)" నుండి వెలికితీశారు