రామశర్మ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''ఉప్పులూరి రామశర్మ''' గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాలలో ప్రవేశించాడు. ఇతనిది కాకినాడ. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించాడు.అందగాడైన రామశర్మ సంభాషణలు చెప్పటంలో సైతం మేటి. కృష్ణకుమారి తొలి చిత్రం 'నవ్వితే రత్నాలు' బిఎన్‌ కళాత్మక చిత్రం బంగారుపాప, సావిత్రితో మేనరికం, ప్రపంచం చిత్రాల్లోనూ నటించారు.<ref>[http://www.visalaandhra.com/movieworld/article-36028 తళుక్కుమని మెరిసి మరుగైన నటులు]</ref>
==జీవిత విశేషాలు==
 
రామశర్మ పూర్తి పేరు "ఉప్పలూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ". ఆ పేరు చాలా పెద్దదిగా ఉందని భావించి సినిమాలలోకి వచ్చిన తర్వాత రామ శర్మగా తన పేరు కుదించుకున్నారు. ఆయన స్వస్థలం పిఠాపురం. అక్కడే హైస్కూల్ వరకూ చదువుకున్నారు. తర్వాత కాకినాడలో గణిత శాస్త్రంలో బి.ఎ. చేశారు.
 
Line 8 ⟶ 7:
 
ఇక అప్పుడు నాటకాలపై దృష్టిని కేంద్రీకరించారు రామశర్మ, ఆ రోజులలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా ముమ్మరంగా ఉండేది. ఆ పార్టీ ಸಿద్దాంతాలతో తను ఏకీభవిస్తూ "సంస్కృతి " అనే నాటికను రాసి దానిని ప్రదర్శించారు. ఆనాటి ఆంధ్రనాటక కళాపరిషత్లో రామశర్మ ప్రదర్శించిన “గౌతము బుద్ధ" నాటకానికి ఎంతో ప్రజాదరణ లభించింది. ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు కురుమద్దాలి రామచంద్రరావు "మంత్రదండం" సినిమా కోసం పిలిపించారు. అలాగే మీర్జాపూరు రాజావారు "తిలోత్తమ" చిత్రంలో హీరో పాత్రకోసం రామశర్మకు మేకప్ టెస్టు చేసారు. అయితే ఆ రెండు సినిమాలలోనూ వేషాలు ఆయనకు దక్కలేదు. ఆ చిత్రాలలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించారు.
 
ఒకింత నిరాశకు గురయినా తనని తేను సముదాయించుకుని నాటకాల మీద దృష్టి కేంద్రీకరించారు రామశర్మ. అదే సమయంలో తమిళనాడు టాకీస్ అధినేత సౌందరరాజన్ అంతా కొత్త వారితో ఒక సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నారు. ఆ విషయం తెలిసి దాసు అనే ప్రొడక్షన్ మేనేజర్ రామశర్మను సౌందరరాజన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన్ని చూడగానే మేకప్ టెస్ట్, కాస్యూమ్స్ టెస్ట్ ఏమీ చేయకుండానే ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అందులోనూ ద్విపాత్రాభినయం. తొలి చిత్రంలోనే రెండు పాత్రలు చేసే అవకాశం అతి అరుదుగా లభిస్తుంది. అందుకే రామశర్మ అదృష్టవంతుడని అభినందించేవారంతా. అన్నట్లు ఆయన తొలి సినిమా పేరు "అదృష్టదీపుడు" కావడం గమనార్హం. ఈ చిత్రంలో అదృష్టదీపుడు, హరిదత్తుడు పాత్రలను రామశర్మ పోషించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావుకు కూడా ఇదే తొలి సినిమా. ఇందులో విక్రభద్రుడు పాత్రను పోషించారాయన.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/రామశర్మ_(నటుడు)" నుండి వెలికితీశారు