రామశర్మ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
ఆరోజులలో రామశర్మ, సావిత్రిల జంట చూడ ముచ్చటగా ఉండేది. వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారేమోనని కూడా చాలామంది చెప్పకునేవారట. రామశర్మ కెరీర్ 1956తోనే పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే హీరోగా చాలా బిజీగా ఉన్న రోజులలో కుటుంబ సమస్యల కారణంగా ఓ ఏడాది పాటు ఆయన చిత్రరంగానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ సమస్యలను పరిష్కరించు కుని తిరిగి చిత్రపరిశ్రమకి వచ్చేసరికి ఆయన స్థానాన్ని అనేక మంది కొత్త తారలు ఆక్రమించడం జరిగింది.
==జీవిత చరమాంకంలో==
అటువంటి పరిస్థితులలో రామశర్మ స్నేహితులైన నిర్మాతలు ఛటర్జీ , కోనేరు రవీంద్రనాథ్, జి.రామినీడు వంటివారు తమ చిత్రాలు "భక్తపోతన", "జేబుదొంగ", "విజృంభణ" లలో అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్. కొత్త హీరోల ప్రవేశంతో రామశర్మకు అవకాశాలు తగ్గిపోయి క్రమంగా తెరమరుగు కావాల్సి వచ్చింది. అయినా తలవంచకుండా, ఒకరిని యూచించే పరిస్థితి రానివ్వకుండా రామశర్మ జాగ్రత్త పడ్డారు. ఆ సమయంలో ఆయన చదువు కున్న చదువు అక్కరకు వచ్చింది. రేస్‌కోర్సులో ఉంటూ ఏ గుర్రం గెలుస్తుందో టిప్స్ చెబుతూ కాల క్షేపం చేసేవారు. హోమియో వైద్యుడుగాను సేవలు అందించారు. సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన రామశర్మ చివరకు అనామకంగానే జీవితాన్ని చాలించాల్సి వచ్చింది.<ref>[http://telugucinemacharitra.com/%E0%B0%AE%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%B9%E0%B1%80%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B6/ మరుగున పడిన మరో హీరో రామశర్మ]</ref>
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/రామశర్మ_(నటుడు)" నుండి వెలికితీశారు