ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 161:
ప్రత్తిపాడు గ్రామంలో, శ్రీ పరమేశ్వర స్వామి ఆలయ సమీపంలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,జూన్-20న నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భాగంగా, 16వ తేదీన, వేదస్వస్థితో గ్రామ ప్రదక్షిణ, ఆలయ యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ తదితర పూజలు నిర్వహించినారు. 19వ తేదీతో మండప దేవతా పూజలు, నీరాజన మహిమంత్రపుష్పాలతో ముగింపుకు చేరుకొనును. 20వ తేదీన యంత్రస్థాపన, విగ్రహాల ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [6]
===శ్రీ వేణుగోపాల సీతారామస్వామివారి ఆలయం===
విశిష్టత గల ఈ పురాతన ఆలయాన్ని, అప్పటి ప్రభుత్వంలో జమీందారుగా ఉన్న, చిలకలూరిపేటకు చెందిన శ్రీ కొరుగంటి వెంకటరెడ్డి, 1364లో, గ్రామం మధ్యలో నిర్మించినారు. అప్పటి రోజులలో వీరు గ్రామంలోని దండేశ్వరస్వామివారికి సకల ఉత్సవాలు నిర్వహించేవారు. మొదట స్వామివారి ప్రక్కన రుక్మిణీదేవి ఉండి, శ్రీ గోపీనాథస్వామిగా పూజలందుకునేవారు. అనంతరం శ్రీనివాస వెంకటాచార్యులవారు సత్యభామ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామిగా పేరు వచ్చినది. 1760 లో శ్రీ వెంకటకృష్ణమ్మ ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించినారు. 1925 ఏప్రిల్-5 నుండి, ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఈ ఆలయ కార్యకలాపాలు నడచుచున్నవి. ఈ అలయంలో స్వామివారి విగ్రహం ఉత్తర ముఖంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారదర్శనానికి ప్రత్యేకత ఉన్నది. [18]
 
ప్రత్తిపాడులోని తూర్పుబజారులో ఉన్న ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయశిఖరం, విగ్రహాల ప్రతిష్ఠ, 2014, జూన్-21, శనివారం వైభవంగా నిర్వహించినారు. ఉదయం మంటపారాధనలకు నిత్యపూజ, గర్తన్యాసము, బీజన్యాసము, రత్నన్యాసము, ధాతున్యాసము, యంత్రప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, సంపాతాజ్యపాతము, కళాన్యాసము, కళాహోమము , పూర్ణాహుతి, ధేనుదర్శనము, కుంభము మొదలగు పూజాకార్యక్రమాలు దంపతులచే నిర్వహించారు. పరిసర గ్రామాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, ఈ ఉత్సవాన్ని తిలకించి, స్వామివార్లను దర్శించుకొని, తీర్ధప్రసాదాలను స్వీకరించినారు. అనంతరం భక్తులుకు అన్నదానం నిర్వహించినారు.ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనుండి, 11వ తేదీ గురువారం వరకు, స్వామివారి బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించినారు. మూడవరోజు గురువారం మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ ఉత్సవాలకు, పత్తిపాడు గ్రామం నుండియేగాక, భక్తులు సమీప గ్రామాలనుండి గూడా అధికసంఖ్యలో తరలివచ్చినారు. [8]&[12]