మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==జననం==
[[File:Talagunda Pillar inscription (455-460 AD) at Talagunda.JPG|right|thumb|తాళగుంద స్థంభ శాసనం మయూర శర్మ జీవితం మరియు వంశావళిని వివరిస్తుంది]]
కాదంబ వంశం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం, వీరు మూక్కంటిముక్కంటి, నాలుగుచేతులు కలవాడైన ‘త్రిలోచన కాదంబు’ని వంశస్థులు. కదంబ వృక్షంవద్ద, [[శివుని]] నుదుటి నుండి జారిపడిన చెమట చుక్కల నుండి ఈ ‘త్రిలోచన కాదంబుడు’ ఉద్భవించాడు. మరొక కథ ప్రకారం, ముక్కంటి ఐన మయూరశర్మ రుద్రునికీ, భూమికీ ఒక కదంబ వృక్షం నీడన జన్మించాడు. ఇంకొక కథ ప్రకారం, ఒక జైన తీర్థంకరుని సోదరికి కదంబ వృక్షం నీడన జన్మించాడు. ఇవన్నీ మయూరశర్మకి దైవత్వాన్ని ఆపాదించే కథలే. <ref name="legend">Moraes (1931), pp7-8</ref>
క్రీ.శ. 450లో కాదంబ వంశస్థుడు శాంతివర్మ వేయించిన తాళగుంద శాసనం<ref>[http://puratattva.in/2013/10/10/talagunda-2594] puratattva.in. Retrieved on 2015-11-13.</ref> ప్రకారం, మయూర శర్మ వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుడు. ఇతనిది మానవ్య గోత్రం. బంధుశేనుని కుమారుడు. వారి ఇంటివద్ద కదంబ వృక్షం ఉండిన కారణంచేత వీరు, కాదంబ వంశము వారిగా పిలువబడ్డారు.
[[కన్నడ]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ తాళగుందకి చెందినవాడు. కొందరు [[తెలుగు]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ కోనసీమకి చెందిన వేదపండితుడు.
పల్లవ రాజ్యంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, మయూరశర్మ కత్తిపట్టినట్టు తెలుస్తున్నది.
 
"https://te.wikipedia.org/wiki/మయూరశర్మ" నుండి వెలికితీశారు