వి. ఎస్. ఆర్. స్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] మండలం, [[వలివర్తిపాడు]] గ్రామంలో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి [[ఫోటోగ్రఫీ]]<nowiki/>పైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద [[ఫోటోగ్రఫీ|ఫొటోగ్రఫీ]]<nowiki/>లో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. [[వీరాభిమన్యు]], [[బందిపోటు]] చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశాడు. కృష్ణ నటించిన [[అసాధ్యుడు (1968 సినిమా)|అసాధ్యుడు]] చిత్రంతో మొదటి సారిగా ఇతడు [[ఛాయా గ్రాహకుడు|ఛాయాగ్రాహకుడ]]<nowiki/>య్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా [[సింహాసనం (సినిమా)|సింహాసనం]]కు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు [[ఎం.వి.రఘు]], [[ఎస్.గోపాలరెడ్డి]], [[రాం ప్రసాద్]] లు ఇతని శిష్యులే.
==వెండితెరపై అద్భుతాలు==
[[మోసగాళ్ళకు మోసగాడు]] సినిమా క్లైమాక్స్ తీస్తున్నారు. [[ఘట్టమనేని కృష్ణ|హీరో కృష్ణ]], విలన్ని గట్టిగా గూబమీద కొట్టాలి. ఆ దెబ్బకి అతనికి లోకమంతా గిర్రున తిరిగే ఎఫెక్టు రావాలి. ఈ నన్నివేశం ఎలా తీయాలి?. అందరూ టెన్షన్ పడుతున్నారు గానీ, కెమెరామన్ మాత్రం తాపీగా ఆలోచిసూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత లారీ టైర్ తెమ్మని పురమాయించారు. దాన్ని తాడుతో వేలాడదీశారు. "ఈ లారీటైర్తో ఈయనగారు ఏం చేస్తారా" అని యూనిట్ అంతా వళ్లంతా కళ్ళు చేసు కుని మరీ చూస్తుంటే, ఆ కెమెరామన్ తన కెమెరాతో సహా ఆ లారీటైర్లో కూర్చుని దాన్ని గిర్రున తిప్పమని ఆదేశించారు. అలా టైర్లో గిర్రున తిరుగుతూ ఆ సీన్ షూట్ చేశారు. ఆ కాలంలో యిప్పటిలా క్రేనులూ, గ్రాఫిక్సూ లేనప్పటికీ కేవలం తన బుర్రతోనే [[కెమెరా]]<nowiki/> కు పని చెప్పి వెండితెరపై వండర్స్ చేశారు. ఆయన ఛాయాగ్రహణ శాఖలో పూనా ఫిల్మ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన తొలి బృందంలో ఒకరు. రవికాంత్ నగాయిచ్ లాంటి మహామహుల దగ్గర శిష్య రికం చేసిన స్వామి [[అసాధ్యుడు (1985 సినిమా)|అసాధ్యుడు]]"(19881985)తో కెమెరామన్ గా మారారు<ref name="Cameraman VSR Swamy">{{cite news|title=Cameraman VSR Swamy|url=http://www.newindianexpress.com/entertainment/tamil/article3833.ece|accessdate=20 December 2015|agency=Indian Express|publisher=By Express News Service|date=12 November 2008}}</ref>. తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం (కెమెరా) తిప్పారు. ఆయన ఖాతోలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి.
 
హిందీలో 'మహాశక్తిమాన్' అనే త్రీడీ చిత్రం, తెలుగులో [[ఆపద్బాంధవులు]], [[కలియుగ స్త్రీ]] చిత్రాలను దర్శకత్వం వహించారు. అలాగే [[ఎదురీత]] అనే సినిమా నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన 'అడవి రాముడు'.
"https://te.wikipedia.org/wiki/వి._ఎస్._ఆర్._స్వామి" నుండి వెలికితీశారు