మాధవపెద్ది గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 78:
| box_width =
}}
'''మాధవపెద్ది గోఖలే''' [[తెలుగు సినిమా]] ప్రపంచంలో ఉన్నతమైన [[కళా దర్శకులు]], చిత్రకారులు.

వీరు గుంటూరు జిల్లా, [[తెనాలి]] తాలూకా, [[బ్రాహ్మణకోడూరు]] గ్రామములో [[1917]]లో జన్మించాడు. కొడవటిగంటి కుటుంబరావుకి దగ్గర బంధువు. గోఖలే [[విజయా స్టుడియో]]లో శాశ్వత కళా దర్శకులుగా పనిచేసి, ఎన్నో విజయవంతమైన పౌరాణిక, చారిత్రక చిత్రాలు విజయం పొంది శాశ్వత స్థానం పొందడానికి కీలకమైన కృషి చేశాడు. అంతే కాకుండా గోఖలే మంచి చిత్రకారుడు, సాహితీవేత్త, జర్నలిస్టు, మానవతావాది. '[[యువ]]', 'ఆంధ్రజ్యోతి' పత్రికలలో ఎన్నో చిత్రాలు వేశాడు. రచనా రంగములో కూడ కృషి చేసి 'బల్లకట్టు పాపయ్య', 'మూగజీవాలు (కథాసంపుటి)', 'గోఖలే కథలు' మున్నగు రచనలు చేశాడు. వీరు గ్రామీణ జీవితాలను తమ కథలలో అతి సహజంగా సాక్షాత్కరింప చేశారు.
 
[[పాతాళభైరవి]], [[మాయా బజార్]] తదితర చిత్రాల్లో కథాకాలంనాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాత్రధారులు ధరించే సుస్తులు, నగలు, కట్టూ బొట్టూ అచ్చం తెలుగుతనం ఉట్టిపడేవి. చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్ లు వేసేవారు.
 
అతడు [[ప్రజాశక్తి]], [[ఆంధ్రపత్రిక]]లలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఆయన రచనలలో కనిపించేది. వీరు తెనాలిలోని రామ విలాస సభతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవారు. వీరు [[అభ్యుదయ రచయితల సంఘం]] లోను, [[ఆంధ్ర కళాకారుల సంఘం]] లోను మరియు [[ఆంధ్ర చిత్రకళా పరిషత్తు]] లోను సభ్యులుగా ఉన్నారు.
 
వీరు 1981 సంవత్సరంలో మరణించారు.<ref>గోఖలే మాధవపెద్ది, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 499.</ref>
"https://te.wikipedia.org/wiki/మాధవపెద్ది_గోఖలే" నుండి వెలికితీశారు