ఆవుల గోపాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| death_cause =
| known = ప్రసిద్ధిచెందిన [[హేతువాది]]
| occupation =[[న్యాయవాది]]
| title =
| salary =
పంక్తి 36:
}}
[[ఎ.జి.కె.]] గా ప్రసిద్ధిచెందిన [[హేతువాది]] '''ఆవుల గోపాలకృష్ణమూర్తి'''. వీరు [[ఏప్రిల్ 29]], [[1917]] న జన్మించారు. [[సూత పురాణం]] లోని పద్యాలన్నీ కంఠతా పట్టాడు. [[ఆవుల సాంబశివరావు]] పై ఈయన ప్రభావం ఉంది. [[రాడికల్ హ్యూమనిస్టు ]], [[సమీక్ష]] పత్రికలు నడిపారు. 1952 తెనాలి లో ఈయన జరిపిన హ్యూమనిస్టు సభకు [[ఎం.ఎన్.రాయ్]] ప్రారంభోపన్యాసాన్ని పంపారు. 1964లో అమెరికా ప్రభుత్వం ఈయన్ని ఆహ్వానించింది. [[వివేకానంద]] పై ఈయన చేసిన విమర్శల ధృష్ట్యా ఈయన్ని అమెరికా వెళ్ళనివ్వరాదని [[ఆంధ్రప్రభ]] ఆందోళన చేసింది.
 
==జీవిత విశేషాలు==
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో కనిష్టుడుగా [[ఏప్రియల్ 29]]-[[1917]]లో జననం. ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసం తురుమెళ్ళలో. ఆనాడే విద్యార్థులలో వేరుగా మసిలాడు. ప్రైవేటుగా తెలుగు చదువుకున్నాడు. అప్పుడే 'కృష్ణశతకం' వ్రాసాడని వినికిడి. కళాశాల విద్యాభ్యాసానికి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరినప్పటినుండి ప్రతిభావ్యుత్పత్తులు విప్పార నారంభించినవి. స్వగ్రామంలో జి.బి.యస్. సరస్వతీ స్వాములవారితో తాత్త్విక చర్చ ఫలితంగా కలానికి పదునెక్కింది. గుంటూరు కళాశాలా జీవితంలో భవిష్యత్తుకు పునాదు లెర్పడ్డాయి. ఇంగర్ సాల్, త్రిపురనేని రామస్వామి రచనలు ఛాందస భావాల్ని ఛేదించటానికి వుపకరించగా, ఆ ప్రోత్సాహం మున్ముందుకు నడిపించింది. పట్టణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడటం అందులో భాగమే. అప్పుడే కర్ణాకర్ణిగా ఎం.ఎన్.రాయ్ ని గురించి విని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలోవుండగా, ఒకానొక కమ్యూనిస్టు రాయ్ ని దూషిస్తుంటే, సాచి చెంపపెట్టు పెట్టిన ఉద్రేకి గొపాలకృష్ణమూర్తి. ఆప్తమిత్రుడు ఎలవర్తి రోసయ్య చాదస్తాన్ని వదలించ దీక్షబూని, త్రిపురనేని రామస్వామి పద్యాలు వినిపించి, విప్లవబీజాలు నాటి ఒకనాటి రాత్రి పిలక కత్తిరించిన చిలిపి గోపాల కృష్ణమూర్తి. యధార్థ సాహిత్య సమితి స్థాపించి గ్రాంధిక వాదానికి మద్దత్తుగా రచనలు సాగించాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, 'ఇండిపెండెంట్ ఇండియా' దినపత్రిక తెప్పించి, గుంటూరులో అమ్మిన ఘట్టాలు కేవలం తలపులుగా నిలిచిపోయినయ్. లక్నోలో ఎం.ఏ., ఎల్.ఎల్.బి., చదువుతుండగా రాయ్, బోస్ ప్రభృతులతో పరిచయమైంది. ఆవుల దృష్టిలో బోస్ 'సోషల్ ఫాసిస్టు' కాగా, రాయ్ తాత్త్విక విప్లవమూర్తిగా సన్నిహితత్వం వల్ల గ్రహించగలిగాడు. నేషనల్ హెరాల్డ్ లో వ్యాసాలు వ్రాయటంతో పత్రికా రచనలోకి దిగాడు. అప్పటి గోపాలకృష్ణమూర్తి తేడాగల రాయిస్టు. చివరివరకూ అలాగే వున్నాడు. తేడా గల రాయిస్టుగా వుండగలగటమే ఆయన వ్యక్తిత్వ విశిష్టత.
==కెరీర్==