ఎ.వెంకోబారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==పరిశోధనలు==
ప్రొఫెసర్ వెంకోబారావు మానసిక శాస్త్రం మీద గాఢ పరిశోధనలు చేసారు. ఆవేశం, మనోద్వేగంతో కూడిన అపవ్యవస్థకు రోగ నిరోధక చర్యలను అధ్యయనం చేసారు. మానసిక అవయవ నిర్మాణాత్మక మైన లేదా మనస్తాపం వలన కలుగు రుగ్మత, దీని వలన కలుగు లక్షణములు - మూర్తిమత్వ పరిణామములు, వాస్తవికతను గ్రహించలేకపోవడం; భ్రాంతి, భ్రమ, మతి విభ్రమం, బూటకపు దృశ్యాలను నిజమనుకోవడం మొదలగు వాటి నివారణా చర్యలంకు చికిత్సలను ఆవిష్కరించారు. ఆందోళానాత్మకమైన/భావోద్వేగ అపవ్యవస్థలకు చికిత్సా మార్గాలను కనుగొన్నారు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ" మాసపత్రికకు సంపాదకులుగా (1970-77) వున్నారు. పలు గ్రంథరచనలు చేసారు. బాగా ప్రసిద్ధి పొందిన వాటిలో కొన్ని: Depressive Diseases , Lithium, psychiatry of Old age in India.
 
డాక్టర్ వెంబోబారావు అసమాన వైద్య కౌశలానికి అనేక గౌరవ పదవులు లభించాయి. కొన్ని వివరాలు; ఇండియన్ మెడికల్ అసోసియేషన్, న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా; ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసన్; ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్; సొసైటీ ఫర్ క్లినికల్ సైకితాట్రిస్ట్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూసైడోలజీ మొదలగు అంతర్జాతీయ ప్రసిద్ధ సంస్థలు గౌరవ సభ్యత్వాన్ని అందించాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్యూసైడ్స్ ప్వివెన్షన్ కు ఉఅపధ్యక్షులుగా ఉన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్; అసోసియేషన్ ఆఫ్ గెరొంటోలజీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్యూసైడాలజీ సంస్థలకు అద్యక్షులుగా వ్యవహరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎ.వెంకోబారావు" నుండి వెలికితీశారు