నగరం (సిటీ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
అనేకంగా స్వయంపరిపాలనా, చట్టపరమైన అధికారిత కలిగి ఉంటాయి.<br />
పారిశ్రామిక నగరాలు వసతులు కల్పించడంలోనూ, మురుగునీటి కాలవల నిరహణ, రవాణా మరియు నివాసగృహ సముదాయాలను కలిగి ఉండటం ప్రజలను ఆకర్షించడం వలన నగరాలు క్రమక్రమాభి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ విధంగా ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులూ, ఉద్యోగులూ లభించడం వలన పరిశ్రమలూ పరస్పర లబ్ధి పొందుతూ ఉండటం కొన్ని నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి. ప్రజాబాహుళ్యం అధికంగా ఉండటం వ్యారాభివృద్ధికి, కళా వినోద
పరిశ్రమలniamma అభివృద్ధికి దోహదమౌతాయి. ప్రజాబాహుళ్యఆనికి తగినంత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలూ, విద్యాసంస్థలూ ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా ఒకటి వృద్ధి చెందుతూ ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి అయింది.<br />
సాధారణంగా నగరాలు క్రమాభివృద్ధిలో నగరవెలుపలి ప్రాంతాలూ విస్తరించి ఒక్కోసారి ప్రక్కనగరం వరకూ కూడా ఒక్కోసారి విస్తరిస్తాయి ఈ కారణంగా కొన్ని జంట నగరాలు ఏర్పడతాయి. ప్రపంచంలో అనేక [[జంట నగరాలు]] ఉన్నాయి. ఆంగ్లంలో వీటిని సిస్టర్ సిటీస్ గా వ్యవహరిస్తుంటారు.మనదేశంలోని [[హైదరాబాదు]] మరియు [[సికింద్రాబాద్]] ఈకోవకు చెందినవే.
 
"https://te.wikipedia.org/wiki/నగరం_(సిటీ)" నుండి వెలికితీశారు