జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
ఖాపర్డేకు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేయడము ,ఎక్కువగా నిద్రపోవడమూ అలవాటు . ఈ రెండు అలవాట్లు మంచివి కావని ,వాటిని తొలగించు కోమనీ బాబా అతనికి బోధించారు . అంతేకాదు ;కీర్తి ,ధనమూ మితిమీరి సంపాదించడం చెడు దారి తీస్తుందని ,కనుక చాలా ప్రమాదకరమనీ బాబా అతనికి తెలియజెప్పారు . మనం జీవితంలో దేని గురించి ఎంతగా తాపత్రయపడినా మనకెంత ప్రాప్తముంటుందో అదే దక్కుతుందని అతనకి నేర్పారు సాయి . కాలాంతరంలో అతని స్నేహితుడైన బాల గంగాధర్ తిలక్ కూడా బాబాను దర్శించి ఆయన ఆశీస్సులు పొందాడు .
==ఖాపర్దే డైరీ విశేషాలు==
ఖాపర్డే కు డైరీ వ్రాయడం అలవాటు. అతడు బాబా సన్నిధిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి డైరీ వ్రాసుకున్నాడు. సాయి భక్తులకు బాబాను గురించి తెలుసుకోడానికి అతడు వ్రాసిన డైరీ ఎంతగానో ఉపయోగపడింది . అందులో అతడిలా వ్రాశాడు.
;జనవరి 17,1912 :-
"ఈ రోజు బాబా ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వారు. నవ్వు ఎంత బాగుందో! దానిని ఒక్కసారైనా చూడడానికి శిరిడీలో ఎన్ని సం॥లైనా ఉండి ఎదురు చూడవచ్చు. అది చూసి పారవశ్యంతో నన్ను నేనే మరచిపోయాను. కళ్లార్పకుండా అలా బాబానే చూస్తూ ఉండిపోయాను."
 
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు