"కోణార్క సూర్య దేవాలయం" కూర్పుల మధ్య తేడాలు

'''కోణార్క సూర్యదేవాలయం''', 13వ శతాబ్దానికి చెందిన [[సూర్యుడు|సూర్య]] దేవాలయం, [[ఒడిషా]] ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు.
==ఆలయ విశేషాలు==
గంగావంశానికి చెందిన [[లాంగులా నరసింహదేవ I]] (క్రీ.శ. 1236-1264) లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే '''మైత్రేయవన''' మనిఅందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. అదెట్లనగా: శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంజన స్త్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రిశాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చద్రభాగాతీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈమందిరానికి పవిత్రత కలిగినదట. [[ఒడిషా]] లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం ([[పూరి]]), చక్రక్షేత్రం ([[భువనేశ్వరం]]), గదాక్షేత్రం ([[జాజ్ పూర్]]), ఈ పద్మక్షేత్రం ప్రస్సిధమైనవి.ఈ క్షేత్రం హిందువులకేకాదు,హిందువులకు మహమ్మదీయులకుకూడాఅత్యంత పవిత్రంమైనది , పుణ్యక్షేత్రమే. ఇచ్చోటనే భక్త [[కబీరుదాసు]] సమాధి ఉండెనని [[అబుల్ఫజల్]] యొక్క [[అయినీ అక్బరీ]] చెప్పుతోంది.
దీనికి ''నల్ల పగోడా'' అనికూడా అంటారు.దీనిని [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] గా ప్రకటించారు.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1801761" నుండి వెలికితీశారు