"ఎ.బి.బర్థన్" కూర్పుల మధ్య తేడాలు

2,883 bytes added ,  4 సంవత్సరాల క్రితం
==ప్రారంభ జీవితం==
ఆయన [[సెప్టెంబరు 25]] [[1924]] న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బరిసాల్ లో జన్మించారు. ఆయన తన 15వ యేట నుండి కమ్యూనిస్టు భావాలను కలిగియుండి నాగపూర్ వెళ్ళారు.<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref> ఆయన 1940 లో నాగపూర్ విశ్వవిద్యాలయం లోని ఆల్ ఇందియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో చేరారు.<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref> ఆ కాలంలో నిషేదింపబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా లో అదే సంవత్సరం చేరారు. ఆయన నాగపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఆయన ఆర్థికశాస్త్రం మరియు న్యాయశాస్త్రాలలొ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను కూడా పొందారు.<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref>
==సంకీర్ణ శకంలో కీలక పాత్ర==
1957లో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన బర్ధన్.. అదే ఏడాది మహారాష్ట్ర శాసనసభకు నాగ్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967, 1980 సంవత్సరాల్లో విదర్భ నుంచి పార్లమెంటుకు పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. 1990ల్లో ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిన బర్ధన్.. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. ఇంద్రజిత్‌గుప్తా నుంచి బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో.. సీపీఎం కురువృద్ధుడు హరికిషన్‌సింగ్‌సూర్జిత్‌తో కలిసి, బర్ధన్ కీలక పాత్ర పోషించారు.
 
ఆ ప్రభుత్వంలో సీపీఐ చేరటంలోనూ బర్ధన్ పాత్ర కీలకమైనది. ఆ సర్కారులో ఇంద్రజిత్‌గుప్తా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడటంలోనూ దానికి వెలుపలి నుంచి మద్దతు ఇవ్వటం ద్వారా సూర్జిత్, బర్ధన్‌లు కీలక పాత్ర పోషించారు. పదహారేళ్ల పాటు వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన బర్ధన్.. 2012లో ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యులకు మార్గదర్శనం కొనసాగించారు.<ref>[http://www.sakshi.com/news/national/bardan-passes-away-302433 బర్ధన్ అస్తమయం]</ref>
 
==మరణం==
ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న బర్ధన్ గత నెల 7వ తేదీన మధ్య మెదడు నాడిలో పూడిక కారణంగా పక్షవాత పోటు (బ్రెయిన్ స్ట్రోక్)కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్‌కు చికిత్స అందిస్తున్నారు.<ref>http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1801937" నుండి వెలికితీశారు