పరాన్నజీవనం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడ...
 
పంక్తి 2:
 
==పరాన్న జీవుల రకాలు==
*1. బాహ్య పరాన్నజీవులు (Ectoparasites): ఇవి అతిథేయి శరీరం వెలుపలి తలం మీద జీవిస్తాయి. ఉదా: [[పేలు]].
*2. అంతః పరాన్నజీవులు (Endoparasites): ఇవి అతిథేయి శరీరం లోపలి భాగాల్లో జీవిస్తాయి. అవి నివసించే దేహభాగాలనుబట్టి వీటిని మూడు రకాలుగా గుర్తించారు.
**ఎ. కుహర లేదా గహ్వర పరాన్నజీవులు (Coelozoic or Luminal parasites): ఇవి దేహంలోని వివిధ కుహరాలలో జీవిస్తుంటాయి. ఉదా: 1. [[ట్రైకోమోనాస్ వెజైనాలిస్]] అనే స్త్రీల యోనిలో ఉండే కశాభయుత ప్రోటోజోవా జీవి. 2. మానవుడి పేగులో ఉండే [[బద్దెపురుగు]]లు, [[ఏలికపాము]]లు.
**బి. కణాంతర లేదా కణజాల పరాన్నజీవులు (Histiozoic or Intercellular parasites): ఇవి అతిథేయి కణజాలల్లో, కణాల మధ్య జీవించే పరాన్నజీవులు. ఉదా: 1. [[ఎంటమీబా హిస్టోలైటికా]] యొక్క మాగ్నా రూపం. ఇది మానవుడి పెద్దపేగు, అంధబాహువు కుడ్యాలలో నివసిస్తుంది. 2. [[ఉచరీరియా బాంక్రాఫ్టి]] మానవుడి శోషరస నాళాలు, శోషరస గ్రంధుల్లో జీవిస్తుంది.
**సి. కణాంతస్థ లేదా కణాలలో జీవించే పరాన్నజీవులు (Cytozoic or Intracellular parasites): ఇవి కణాల లోపల జీవించే పరాన్నజీవులు. ఉదా: 1. [[ప్లాస్మోడియమ్]] తన జీవిత చరిత్రలోని కొన్ని దశల్లో కాలేయ కణాల్లోను, రక్తంలోని ఎర్ర రక్తకణాల్లోను జీవిస్తాయి. 2. [[లీష్మానియా డోనావాని]] మానవుని రెటిక్యులో ఎండోథీలియల్ కణాలలో జీవిస్తుంది.
 
==అతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం==
"https://te.wikipedia.org/wiki/పరాన్నజీవనం" నుండి వెలికితీశారు