సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''సుద్దాల హనుమంతు''' ఒక సుప్రసిద్ధ ప్రజాకవి. కవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
 
== జననం ==
[[ నల్లగొండ]] జిల్లా [[మోత్కూరు]] మండలంలోని [[పాలడుగు (మోతుకూరు)|పాలడుగు]] గ్రామంలో [[1908]], [[డిసెంబర్‌]] నెలలో పేద [[పద్మశాలి]] కుటుంబంలో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో నివసించడంతో ఆ ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు. హన్మంతు తండ్రి ఆయుర్వేద వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాదు చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశాడు. [[ఆర్యసమాజం]] వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
 
Line 17 ⟶ 18:
ప్రాణ త్యాగాల్లోనే కాకుండా సాయుధ పోరాటానికి ఇరుసుల్లా పనిచేసే గొప్ప నాయకత్వాన్ని, తిరుగులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి ప్రజల్ని గెరిల్లా పోరాట వ్యూహాలకు కూడా సిద్ధం చేసింది.
 
== మరణం ==
ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు. జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన సుద్దాల హనుమంతు క్యాన్సర్‌ వ్యాధితో [[1982]], [[అక్టోబర్ 10 ‎ ]] న అమరుడయ్యాడు.
 
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు