బెజవాడ పాపిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' బెజవాడ పాపిరెడ్డి''' ([[జనవరి 5]], [[1927]] - [[జనవరి 7]], [[2002]]) సోషలిస్టు నాయకుడు, [[లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్]] అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. వీరు ప్రముఖ రాజకీయ నాయకులు [[బెజవాడ రామచంద్రారెడ్డి]] కుమారుడు.
 
== జననం ==
పాపిరెడ్డి [[జనవరి 51927]], [[1927జనవరి 5]] న<ref>http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90p.htm</ref> [[నెల్లూరు]] జిల్లా [[బుచ్చిరెడ్డిపాలెం]]లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1958 నుంచి 1962 వరకు [[శాసనమండలి]] సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు [[రాజ్యసభ]] సభ్యుడిగా పని చేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో [[ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం|ఒంగోలు]] లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
 
== మరణం ==
బెజవాడ పాపిరెడ్డి ఆయన తన 75 ఏట కొద్దికాలము పాటు అస్వస్థత గురై [[జనవరి 72002]], [[2002జనవరి 7]] న [[హైదరాబాదు]]లో కన్నుమూశారు.<ref>http://pib.nic.in/archieve/lreleng/lyr2002/rjan2002/08012002/r0801200212.html</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_పాపిరెడ్డి" నుండి వెలికితీశారు