గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==ఉద్యోగ ప్రస్థానం==
ఈయన కొంతకాలం ఎర్నగూడెం తాలూకాలో తెలికిచెర్ల జమీందారు [[రాజా కాకర్లపూడి వేంకటరమణయ్య]] ఆశ్రయములో వున్నాడు. ఆ జమీందారుగారి వినోదార్థము కవితాగోష్ఠులను, అష్టావధానములను కావించి, 8 ఎకరముల భూవసతిని సన్మానముగా గ్రహించినాడు. నర్సాపురములో జరిగిన సభలో "కవిశేఖర" బిరుదమును పొందాడు. 1922 లో [[ఏలూరు]]లోని గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయములో సంస్కృతాంధ్ర పండితుడిగా చేరినాడు. 1930వ దశకంలో "ఢంకా" అనే పత్రికను నడిపినాడు. 1935 లో మంజువాణీప్రెస్ , రామా అండ్ కో, వెంకటరమణ పవరుప్రెస్ మొదలైన ముద్రణాలయములలో గ్రంథపరిశోధనము గావించాడు. 1947 లో సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషాసేవ ఒనర్చినాడు.
 
==స్వాతంత్ర్య పోరాటం==