అడవులదీవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
ఈ పాఠశాల, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు మట్టిలో మాణిక్యాల్లా పలు రంగాల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. శ్రీ గుమ్మడి సీతారామయ్య గారు ప్రధాన అధ్యాపకులుగా ఉన్న కాలంలో ఇక్కడి పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించారు. శ్రీ రామనాధ శర్మ గారు గణితం, సామాన్య శాస్త్రం, వెంకటేశ్వరరావు మాస్టారు సోషల్ ఇంగ్లీషు బాగా చెప్పేవారు. వారి దగ్గర చదువుకున్న పిల్లలు అందరూ బాగా పైకొచ్చారు. ఎలిమెంటరీ పాఠశాలల్లో కూడా మంచి విద్యాభోదన జరిగేది. బడుగు ప్రసాదరావు మాస్టారు, బెజవాడ మాస్టారు, కత్తుల సుబ్బారావు మాస్టారు, దుర్గారావు మాస్టారు, బి.యస్వీ.మరియమ్మ టీచర్ ఇలా ఎంతో మంది ఆరితేరిన మేధావులు ఆ మారుమూల గ్రామంలో పిల్లలకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందించారు. ఈ గ్రామంలో చదివిన బి.డి.పాల్సన్ ఐ.పి.యస్.కు, బి.డి.యం. అంబేద్కర్ ఐ.ఐ.యస్.కు ఎంపికై ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు.
 
ఈ పాఠశాలలో ఆంగ్లభాషోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కోపూరి వసంతరావు కు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేటు పట్టా ప్రదానం చేసినది. [10]
 
===గున్నంతిప్ప మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
"https://te.wikipedia.org/wiki/అడవులదీవి" నుండి వెలికితీశారు