మార్క్ ట్వేయిన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్ (ఇక మీదట మార్క్ ట్వెయిన్ గా వాడుదాం) అమెరికా (USA) లోని ఫ్లోరిడా, మిస్సొరి లో నవంబర్ 30, 1835 న జన్మించారు. ఈయన తల్లి గారు జేన్ లామ్టాన్ క్లెమెన్స్, తండ్రి
 
శామ్యూల్‌ కి నాలుగు సంవత్సరాల వయస్సప్పుడు అతని తల్లిదండ్రులు [[ముస్సోరీ]] రాష్ట్రంలోని హానిబల్‌ అనే ఊరికి బస మార్చేరు. ఈ ఊరు ప్రతిబింబమే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన "టామ్‌ సాయర్‌ సాహస యాత్రలు (The Adventures of Tom Sawyer, 1876), హకల్‌బెరీ ఫిన్‌ సాహస యాత్ర;లు (The Adventures of Huckleberry Finn, 1884 ) అనే పుస్తకాలలో మనకి దర్శనమిస్తుంది.
 
శామ్యూల్‌ తన చిరుతప్రాయం అంతా సంపన్నమైన కుటుంబంలోనే గడిపేడు. వారి సంపదకి గురుతుగా ఆ ఇంట ఎంతో మంది నీగ్రో బానిసలు ఉండేవారు. ఆ రోజుల్లో తెల్లవాళ్లు నల్ల బానిసలని ఎలా చూసేవారో మనకి ఇతని నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. శామ్యూల్‌ తండ్రి 1847 లో చనిపోవడంతో వీరి సంసారం ఎన్నో ఆర్ధికమైన ఇబ్బందులని ఎదుర్కొంది. శామ్యూల్‌ బడి మానేసి ఒక ముద్రణాలయంలో చేరి, పని నేర్చుకుంటూ, పొట్టగడుపుకోవడం మొదలు పెట్టేడు. శిక్షణ పూర్తి అయిన తరువాత, 1851లో, తన అన్న ఒరాయన్‌ నడుపుతూన్న ద హానిబల్‌ జర్నల్‌ అనే పత్రికకి అచ్చు మూసలు సమకూర్చే పనిలో చేరేడు. కాని చురుకైన శామ్యూల్‌ బుర్రకి హానిబల్‌ పరిధి సరిపోలేదు; దేశ దిమ్మరిలా తిరుగుతూ [[నూయార్క్‌]], [[ఫిలడెల్ఫియా]] వంటి అనేక [[అమెరికా]] నగరాలలో పని చేసేడు.
 
శామ్యూల్‌ తన చిరుతప్రాయం అంతా సంపన్నమైన కుటుంబంలోనే గడిపేడు. వారి సంపదకి గురుతుగా ఆ ఇంట ఎంతో మంది నీగ్రో బానిసలు ఉండేవారు. ఆ రోజుల్లో తెల్లవాళ్లు నల్ల బానిసలని ఎలా చూసేవారో మనకి ఇతని నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. శామ్యూల్‌ తండ్రి 1847 లో చనిపోవడంతో వీరి సంసారం ఎన్నో ఆర్ధికమైన ఇబ్బందులని ఎదుర్కొంది. శామ్యూల్‌ బడి మానేసి ఒక ముద్రణాలయంలో చేరి, పని నేర్చుకుంటూ, పొట్టగడుపుకోవడం మొదలు పెట్టేడు. శిక్షణ పూర్తి అయిన తరువాత, 1851లో, తన అన్న ఒరాయన్‌ నడుపుతూన్న ద హానిబల్‌ జర్నల్‌ అనే పత్రికకి అచ్చు మూసలు సమకూర్చే పనిలో చేరేడు. కాని చురుకైన శామ్యూల్‌ బుర్రకి హానిబల్‌ పరిధి సరిపోలేదు; దేశ దిమ్మరిలా తిరుగుతూ నూయార్క్‌, ఫిలడెల్ఫియా వంటి అనేక అమెరికా నగరాలలో పని చేసేడు.
=జీవితం=
ఇరవయ్యో పడిలో పడ్డ శామ్యూల్‌కి ముద్రణాలయాల్లో నాలుగు గోడల మధ్య పనిచేయడం పడ లేదు; ఆ ఉద్యోగం వదిలేసి మిసిసిపీ నది మీద తిరిగే పడవలలో కళాసుగా చేరేడు. చేరి, ఆ వృత్తిలో ఎదిగి, చివరికి పడవని నడిపే అధికారి (pilot) గా పనిచేసేడు. ఈ అనుభవం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. ఉదాహరణకి పడవ నడిపేటప్పుడు ఒక మునుజూపు మనిషి (leadsman) ఎదట నీటి లోతు నావ గమనానికి అనుకూలంగానే ఉందని చెప్పడానికి "బైద మార్క్, ట్వైన్" (By the mark, twain) అని అరిచేవారు. ఈ వాక్యం మధ్య భాగంలో ఉన్న "తోకని పీకగా" వచ్చిన మార్క్‌ ట్వైన్ (Mark Twain) అన్న మాటని తన కలం పేరుగా వాడుకుని శామ్యూల్‌ క్లెమెంస్ ప్రపంచ ప్రఖ్యాతి గణించుకున్నాడు. మన బాపు, ఆరుద్ర లలాగే కలం పేరు మార్క్‌ ట్వేన్‌ చాల మందికి తెలుసు - అసలు పేరు తెలియదు.
"https://te.wikipedia.org/wiki/మార్క్_ట్వేయిన్" నుండి వెలికితీశారు