"చిలుకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

ఇతడు [[1951]], [[జూన్ 22]] న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించాడు.
 
చిలుకూరి నారాయణరావు [[గిడుగు రామ్మూర్తి]] తో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో [[తెలుగు]] కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశాడు.
 
దత్తమండలానికి [[రాయలసీమ]] అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, [[గాడిచర్ల హరిసర్వోత్తమరావు]] సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర ''శ్రీ సర్వోత్తమజీవితం''లో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక [[రేడియో]] ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునరుద్ధరించి ఉంటాడని అనుకోవచ్చు<ref>[http://books.google.com/books?id=I3C11beCHF0C&pg=PA11&dq=chilukuri+narayana+rao#v=onepage&q=chilukuri%20narayana%20rao&f=false Rayalaseema during colonial times: a study in Indian nationalism By P. Yanadi Raju]</ref> రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని [[పప్పూరు రామాచార్యులు|పప్పూరు రామాచార్యుల]] చే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.
 
==విశేషాలు==
1,93,233

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1804882" నుండి వెలికితీశారు