సత్యభామ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==శ్యమంతకోపాఖ్యానం==
[[File:The Wedding of Satyabhama and Krishna from Bhagavata Purana.jpg|thumb|300px|సత్యభామ శ్రీకృష్ణునల వివాహము]]
[[వినాయక వ్రత కల్ప విధానము]]లో చదివే వ్రతకథలోని శ్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయవృత్తాంతం హిందువులకు సుపరిచితం. [[సత్రాజిత్తు]] సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. [[సత్రాజిత్తు]] తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజము తెలియని [[సత్రాజిత్తు]] మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు (అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున). ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన [[సత్రాజిత్తు]] కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. అలా సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్ళి చేసినందుకు కోపించిన శతధన్వుడు తరువాత కాలంలో సత్రాజిత్తును[[సత్రాజిత్తు]]ను సంహరించాడు. (సత్యభామను కృతవర్మ బంధువులకిచ్చి వివాహం చేస్తానని పూర్వం ఇచ్చిన మాటను [[సత్రాజిత్తు]] తప్పినందుకు కారణంగా).
 
==సత్యభామ సంతతి==
"https://te.wikipedia.org/wiki/సత్యభామ" నుండి వెలికితీశారు