లయ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
ఈవిడ చిన్నతనంలో నాన్నగారి వృత్తి(ప్రస్తుతం నెఫాలజిస్ట్)రీత్యా మద్రాసులో వున్నప్పుడు ఈవిడ ప్రి-నర్సరీ, నర్సరీ చదువుకున్నది. తరువాత [[విజయవాడ]]కి మారి ఎల్.కె.జి నుంచీ సినిమా రంగానికి వచ్చేవరకూ(ఇంటర్మీడియట్) విజయవాడలోని నిర్మలా కాన్మెంట్లో, హెస్కూల్లో చదువుకున్నది. అమ్మా నాన్నలకి ఈమె ఒక్కర్తెనే సంతానం. నాన్నగారు హాస్పిటల్ డ్యూటీ ఐపోగానే ఎప్పుడూ ఇంటికి వచ్చేసి కుటుంబం తోటే గడిపేవారు. అమ్మా, నాన్నా, ఈమె స్నేహితుల్లా ఉండేవాళ్ళు.
===చదరంగం===
చిన్నప్పటినుంచీ రెండో తరగతిలో వున్నప్పుడే చెస్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. చాలా సీరియస్గా ప్రాక్తీస్ చేసి చెస్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్ర స్థాయిలో ఏడుసారూ, జాతీయ స్థాయి లో ఒకసారీ పతకాలు కూడా గెలుచుకున్నది. చెస్ పోటీలకి బయటి స్కూళ్ళకి వెళ్ళేప్పుడు నాన్న గారు వెంటబెట్టుకుని వెళ్ళేవారు. ఎప్పుడేనా నాన్నగారికి వీలు కాకపోతే అమ్మ వచ్చేది. రెండో తరగతి నుంచీ ఏడో తరగతి వరకూ చాలా సీరియస్ గా చెస్ పోటీల్లో పాల్గొన్నది. తరువాత చెస్ ప్రాక్టీసు చేసే సమయం పెరగడం, దాదాపు రెగ్యులర్ క్లాసులకి వెచ్చించేటంత సమయం అవసరం కావడంతో వీలుకాక ఆ ప్రాక్టీస్ మానేసింది. ఐనా పదో గ్రేడ్ వరకూ అడపాదడపా చెస్ పోటీల్లో పాల్గొనేది.
 
===సంగీతం - నృత్యం===
5వ తరగతి నుంచే సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకోవడం కూడా మొదలుపెట్టింది.అంత చిన్న వయసులోనే ఈమె దినచర్య ఎలా వుండేదంటే పొద్దున్నే సంగీతం క్లాసు, తరువాత స్కూలు, సాయంకాలం డాన్స్ ప్రాక్టీసు ముగించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే చెస్ ప్రాక్టీసుకి వెళ్ళడం తిరిగి రాగానే మళ్ళీ హోమ్ వర్కూ. 5వ తరగతినుంచే ఇలా బిజీగా ఉండేది. వారాంతాలలో, సెలవు రోజుల్లోనూ మాత్రమే చుటుపక్కల పిల్లలతో కలిసి ఆడుకునేది.8వ తరగతినుంచీ కూచిపూడి మానేసి భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. విజయవాడలో జోస్యుల రామచంద్రమూర్తిగారి వద్దా, ఐదేళ్ళ క్రిందట హైదరాబాదు వచ్చాక పసుమర్తి రామలింగ శాస్త్రి గారి వద్దా భరతనాట్యం నేర్చుకున్నది. మరొక చిన్నప్పటి జ్ఞాపకం ఏమిటంటే ఈవిడ నాలుగో తరగతిలో వుండగా, హెదరాబాదు విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కినేని కుటుంబరావు ఆయన తీయబోయే బాలల చిత్రం [[భద్రం కొడకో]] లో నటించడం కోసం పిల్లల్ని వెదుకుతూ వీరి బృందాన్ని చూడడం , అందులో చలాకీగా వున్న లయను చూసి సినిమాల్లో వేషానికి గానూ ఎంపిక చేసుకోవడం జరిగింది<ref name="మొదటి సినిమా-లయ">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-లయ|last1= |first1=లయ|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>.
"https://te.wikipedia.org/wiki/లయ_(నటి)" నుండి వెలికితీశారు