లయ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==మొదటి సినిమా అవకాశం==
ఈమెకు నాలుగో తరగతి లోవున్నపుడే మొదటి సినిమా అవకాశం వచ్చినది. అప్పటికి ఈమెకి సినిమా అంటేనూ, నటించడం అంటేనూ ఏమీ తెలీదు. అమ్మా , నాన్న గార్లే ఆలోచించి ఎలానూ సెలవలే కదా సరదాగా వుంటుంది చెయ్యమన్నారు. అందులో ఒక ముఖ్యపాత్ర అబ్బాయి వాళ్ళ నాన్నగారు, వీరి నాన్నగారూ మిత్రులవడం కూడ ఒక కారణం. దర్శకుడు కుంటుంబరావు ఒక 20 మంది పిల్లలకి వర్క్ షాప్ లాగా నిర్వహించి , నటించడం, స్కిపు చదవడం అన్నీ నేర్పించి అందులోంచి కొంతమందిని ఫైనల్గా సినిమాకోసం సెలక్ట్ చేసుకున్నాడు. అందులో లయను బాలికల్లో ప్రధాన పాత్రకి ఎంపిక చేశారు. ఆ సినిమాకి చాలా అవార్డులొచ్చాయి కూడా. అందులో లయ తోబాటు నటించిన ఒక అబ్బాయికి నేషనల్ ఎవార్డు వచ్చిందికూడా. కాకపోతే మామూలు సినిమాగా విడుదల అవ్వకపోవడం వల్ల ఎక్కువమందిని చేరలేకపోయింది. ఇది అయ్యాక లయ విజయవాడ వచ్చేసి మామూలుగా చదువులో పడిపోయి చెస్, సంగీతం, డాన్సు రెగ్యులర్ స్కూలుతో బిజీగా ఐపోయింది. అప్పట్లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికకి అనుబంధంగా నవీన అనే పత్రిక వచ్చేది. దానిలో ప్రచురణ చేయడానికని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ సీతారామ్గారు ( ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు), లయనూ, లయ సీనియర్ ఒకమ్మాయినీ ఫోటోలు తీసి నవీనకి పంపించేవారు. ఆ విధంగా వీరి ఫోటోలు ప్రతి శనివారం నవీనలో వివిధ శీర్షికల కింద వచ్చేవి. . అలా వుండగా ఈమె 10వ తరగతిలో వున్నప్పుడు (1996) , హాఫ్ ఇయర్లీ శెలవల్లో .... లయ , ఈవిడ సీనియర్ ఫ్రెండు కలిసి ఒకరోజు వీరి ఇంట్లో టి.వి చూస్తున్నాము. జెమిని టి.వి.లో రాఘవేంద్రరావు గారి కొత్త సినిమాకి నటీనటులకోసం స్టార్ 2000 పోటీల గురించి ప్రకటన చూశారు. ఆంధ్రజ్యోతి కోసం అంతకుముందే తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి కదా, అవీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినవే కదా, ఇంక బయోడాటా రాసి పంపించి చూద్దామని వీరిద్దరు అనుకున్నారు. మళ్ళీ అంతలో అనుమానం వచ్చింది 'మేమిలా పంపిస్తే ఎవరు చూస్తారు..ఎన్నో వందల ఫోటోలు వస్తాయి కదా వాళ్ళకి, ఎక్కడో పారేస్తారులే ' అని వీరిలో వీరే అనుకుని ఆ ఆలోచన విరమించుకున్నారు. ఐతే ఈ విషయాన్ని విన్న లయ అమ్మ నీకు నిజంగా ఆసక్తి ఉంటే ప్రయత్నించి చూద్దాం అంది. ఐనా కానీ వద్దులే అమ్మా అన్ని వేల ఫోటోల్లో ఎవరు చూస్తారు అన్నారు . ఐతే ఒకరోజు లయ స్కూల్లో ఉండగా అమ్మ ఫోన్ చేసి 'జెమిని స్టార్ 2000 పోటీలకోసం నువ్వు సెలెక్ట్ అయ్యావు, రాత్రికే బయలుదేరి హెదరాబాదు వెళ్ళాలి, వెంటనే వచ్చెయ్యి ' అన్నది. అప్పుడే తెలిసింది, లయకు తెలీకుండానే అమ్మ పోటీలకి లయ ఫోటో పంపించారని.
 
==లయ నటించిన తెలుగు చిత్రాలు==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/లయ_(నటి)" నుండి వెలికితీశారు