భీమనేని శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==మొదటి సినిమా ==
ఆరోజు మార్చి 25,1984 ఎర్రబస్సు కాదుగానీ ఆర్టీసీ లోనే మద్రాసు ప్రయాణం. అదేమో మహానగరం, ఇతడిదేమో మిడిమిడి జ్ఞానం. అందుకే ముందు జాగ్రత్తగా ఇతని గ్రామ వాత్సవ్యుడు, సీనియర్ ఇంటూరి రామారావు గదిలో దిగాడు. ఇక్కడి డ్రీములకీ అక్కడి ప్రాక్టికాలిటీకీ పొంతన కుదరలా. అభిమాన దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] గారు స్వాగతం పలుకుతారనుకుంటే అక్కడ ఖాళీ లేదు , ఓ ఫైనాన్షియర్ దగ్గర పనిచేసే సూర్యనారాయణ గారేమో ఇతడి రిఫరెన్సు, రికమండేషనూ, ఐనాపని గాలే. అప్పుడు కలల్లోంచి వాస్తవంలోకొచ్చి మనం కావాలనుకున్నది మనకు దొరకనప్పుడు దొరికినదాన్ని మనకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు.
<ref name="మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు /">
 
[[టి.కృష్ణ]] గారు నేటిభారతంతో వెలుగులోకొచ్చిన కొత్త కే నారాయణమూర్తి గారితో ఆయన పరిచయం పరిషత్తుల కాలం నాటిది. [[దేశంలో దొంగలు పడ్డారు]] టైంలో కలిస్తే తర్వాత చిత్రానికి అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. అలా వందేమాతరం’ అసిస్టెంట్ డైరక్టర్ గా ఇతడి మొదటి సినిమా అదే సమయంలో గా [[దేవాలయం]] కు కూడా పనిచేశాడు. అప్పుడక్కడ [[ముత్యాల సుబ్బయ్య]]గారు కోడైరక్టర్ పని నేర్చుకోవడానికి ఆయన సహకారం ఇతడికి బాగా హెల్స్ అయింది. [[రేపటి పౌరులు]] ఇతడి మూడో చిత్రం. అపెంటిస్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్గా ప్రమోషనూ వచ్చింది.
 
అంతా సవ్యంగా వుందనుకునేలోపు అపశృతి టి.కృష్ణ గారి మరణం. ఇతడికే కాదు తెలుగుసినిమా పరిశ్రమకే అది తీరనిలోటు. డిప్రెషను, ఏమిచేయాలో పాలుపోని స్థితి. అదే పరిస్థితి ఆయన మిత్రుడు, వ్యాపార భాగస్వామి[[పోకూరి బాబూరావు]] గారిదికూడా. కష్టాల్లో ఉన్న ఇద్దరం ఒకరికొకరు తోడు. అప్పుడే ఈతరం ఫిలింస్ లో పరచూరి బ్రదర్స్ దర్శకత్వంలో 'ప్రజాస్వామ్యం ' చిత్రం ఆరంభం. అక్కడినుంచి ఈతరం ఫిలింస్లో కోడైరక్టర్ ఇతడే . కొన్నిచిత్రాలకి [[ముప్పలనేని శివ]] తో కలిసి పని చేశాడు . సమయం చిక్కినప్పుడల్లా బయటి దర్శకులదగ్గర కొన్నిచిత్రాలకు పనిచేశాడు.
 
[[బి. గోపాల్]] దగ్గర [[అశ్వత్థామ]], [[స్టేట్ రౌడీ]], [[చినరాయుడు]], ఐవీ శశి దగ్గర [[మాఆయన బంగారం]], [[ఎ. మోహనగాంధీ]] దగ్గర [[కర్తవ్యం]] అలాచేసినవే. అప్పట్లోనే బాబూరావు గారు తన మేనకోడలు సునీతతో పెళ్ళిగురించిన ప్రపోజల్ చెప్పడం, చూడ్డం, నచ్చటం వెంటనే పెళ్ళి జరిగిపోయాయి. [[ముత్యాల సుబ్బయ్య]] గారితో కలసి [[మామగారు]] అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడే [[ఎడిటర్ మోహన్]] గారితో పరిచయం. ఆసినిమాలో ఒక రాత్రి పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆయన ఇతడిని పిలిచి ' 'ఫుల్ మూన్ చాలా బాగుంది మాష్ణారుతో చెప్పి మూన్ కూడా ఫ్రేం లోవచ్చేలా కంపోజ్ చెయ్య మని ' చెప్పాడు . ఇతడు '' అదేంటిసార్ ఇది అమావాస్య రోజు వచ్చే దీపావళి పాట '' <ref name="మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు|last1=శ్రీనివాసరావు|first1=భీమినేని |last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>.
 
==దర్శకత్వం వహించిన సినిమాలు==
===తెలుగు===
*[[శుభమస్తు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}