ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు అనువాదం
చి అంతర్గత లింకు సవరణ
పంక్తి 30:
[[2003]]లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన [[ఒక్కడు]] చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. [[భూమిక]] కథానాయికగా, [[ప్రకాష్_రాజ్|ప్రకాష్ రాజ్]] ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన [[నిజం]] చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో నటనకు గానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు [[నంది_పురస్కారం|బంగారు నంది పురస్కారాన్ని]] అందుకున్నారు. [[2004]]లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే ఏడు విడుదల అయ్యిన [[అర్జున్]] పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని ఛెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయ్యిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
 
అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. [[అతడు]] చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. [[2005]]లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయ్యినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది లభించింది. [[2006]]లో మహేష్ నటించిన చిత్రం [[పోకిరీపోకిరి]] విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీ దిగ్గజాలుగా పేరెన్నిక గన్న [[అమితాబ్_బచ్చన్|అమితాబ్ బచ్చన్]], [[రాం_గోపాల్_వర్మ|రాం గోపాల్ వర్మ]] తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు<ref name="Amitabh wonderstruck by Pokiri ">{{cite web| title= indiainfo.com| work= Amitabh wonderstruck by Pokiri |url= http://movies.indiainfo.com/southern-spice/telugu/pokiri-300606.html|accessdate=4 February|accessyear=2007}}</ref> . ఈ చిత్రానికి గాను మహేష్ [[ఫిల్మ్_ఫేర్_పురస్కారం|ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని]] సైతం గెలుకున్నారు.
 
పోకిరీ తరువాత నిర్మాణం అయ్యిన [[సైనికుడు]] చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.