బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

OK
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted 1 edit by 49.156.155.42 (talk) to last revision by Kvr.lohith. (TW)
పంక్తి 10:
[[స్కంద పురాణం]]లో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది ''స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు''. [[పద్మ పురాణం]]లో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. [[రామానుజాచార్యులు]], [[మధ్వాచార్యులు]] మరియు [[వేదాంత దీక్షితులు]] ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని [[ఉపనిషత్తులు|ఉపనిషత్తులకు]], [[బ్రహ్మ సూత్రాలు|బ్రహ్మ సూత్రాలకు]] భాష్యాలు వ్రాశారు.
 
==బద్రీనాథ్ గుడి==
Badrinath Temple is
[[బొమ్మ:Badrinath temple.jpg|right|thumb|250px]]
బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక [[గుడి]] నిర్మించాడు. 16వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్థుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.
 
బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
 
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.
 
==ప్రత్యేకత==
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు