విమాన వాహకనౌక: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'File:HMS Illustrious01.jpg|right|thumb|250px| అట్లాంటిక్ మహాసముద్రంలో హెచ్.ఎం.ఎస్. ఇల్ల...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==చరిత్ర==
===మూలాలు===
9 మే 1912 లో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన హెచ్.ఎం.ఎస్. హైబర్నియా ఓడకప్పు నుండి మొట్టమొదట సారి విమానం ఎగిరే పరిక్షలు జరిపింది. 1911 లో సముద్రంలో విమానాల సహాయం కొఱకు మాత్రమే ఉపయోగపడే ఓడను [[ఫ్రాన్స్|ఫ్రెంచి]]వారు నిర్మించారు. సెప్టెంబర్ 1914 లో మొట్టమొదటి సారి [[జపాన్ సామ్రాజ్య నౌకాదళం]] విజయవంతంగా విమాన వాహకనౌక సహాయంతో వాయు దాడి పూర్తిచేసింది.
[[File:Wakamiya.jpg|right|thumb|250px|జపనీయుల సముద్ర విమాన వాహకనౌక ''వకమియ'']]
9 మే 1912 లో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన హెచ్.ఎం.ఎస్. హైబర్నియా ఓడకప్పు నుండి మొట్టమొదట సారి విమానం ఎగిరే పరిక్షలు జరిపింది. 1911 లో సముద్రంలో విమానాల సహాయం కొఱకు మాత్రమే ఉపయోగపడే ఓడను [[ఫ్రాన్స్|ఫ్రెంచి]]వారు నిర్మించారు. సెప్టెంబర్ 1914 లో మొట్టమొదటి సారి [[జపాన్ సామ్రాజ్య నౌకాదళం]] విజయవంతంగా విమాన వాహకనౌక సహాయంతో వాయు దాడి పూర్తిచేసింది. దీనితో సమ ఉపరితల (''Flat top'') ఓడలు పెద్ద ఎత్తున ఉత్పత్తి కావడం మొదలయింది. 1918 లో, హెచ్.ఎం.ఎస్. ఆర్గస్, విమానాలు మోహరించడం మరియు కోలుకునే సామర్ధ్యం కల్గిన మొదటి వాహకంగా మారింది. ప్రారంభంలో [[సరుకు ఓడలు]], [[క్రూజర్లు]], [[యుద్ధనౌక|యుద్ధనౌకలు]] విమాన వాహకనౌకలుగా మార్పిడి చెందాయి. 1920 లో అనేక నౌకాదళాలు ఉద్దేశ్యపూరితంగా యుద్ధనౌకలను విమాన వాహకనౌకలుగా రూపొందించడానికి ఆదేశాలు జారీచేశాయి. దీనితో ''హోషో'', ''హెచ్.ఎం.ఎస్. హెర్మస్'', ''బియాన్'' వంటి ప్రతిష్టాత్మక వాహకనౌకలు నియమింపబడ్డాయి.
 
===రెండవ ప్రపంచ యుద్ధం===
విమాన వాహకనౌకలు నౌకాపోరులో నాటకీయ మార్పులు తీసుకువచ్చాయి. వైమానిక ఆధిపత్యం యుద్ధంలో ఒక ముఖమైన అంశంగా మారింది. వాహకనౌకలు, వాటితోపాటు అభికేంద్ర విమానాలు(''Focal aircraft''), అందుబాటులోకి రావటంతో పరిధి, వశ్యత, ప్రభావం పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో, ఈ ఓడలే అమెరికా, బ్రిటిష్ మరియు జపనీయ నౌకాదళాలకు వెన్నుపూసలా నిలిచాయి. 1941 లో జపనీయులు పెర్ల్ హార్బర్ పై జరిపిన [[పెర్ల్ హార్బర్ పై దాడి|ఆశ్చర్య దాడి]] వీటియొక్క శక్తివంతమైన ప్రక్షేపక సామర్థ్యాలకు ఉదాహరణ. తక్కువ-శ్రేణి కాల్పులు మాత్రం వీటి బలహీనత.
 
===యుద్ధానంతర శకం===
ప్రపంచ యుద్ధం ముందు 1922, 1930, 1936 అంతర్జాతీయ నౌకా ఒప్పందాలు అన్ని యుద్ధ నౌకల పరిమాణాలను అదుపులో ఉంచాయి. ఆ తర్వాత నుండి పెరుగుదల కల్పించేందుకు వాహకనౌకల పరిమాణం స్థిరంగా పెరుగుతూ వస్తుంది. నేటి వాహకనౌకల ఎంత విలువంటే తయారీకి దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక ప్రభావాలను ముప్పులో పెడుతున్నాయి. యుద్ధం తరువాత, నౌకలపై కార్యకలాపాలకు పరిమాణం మరియు ప్రాముఖ్యత పెరగటం కొనసాగింది. హెచ్చువాహకలు (''Supercarriers'') వాహకనౌకల వృద్ధిలో పరాకాష్టగా మారాయి. కొన్ని అణు రియాక్టర్ల ఆధారంగా, యుద్ధనావల సముహంలో ముఖ్యభాగంగా వ్యవహరిస్తూ స్వస్థలానికి దూరంగా పనిచేస్తున్నాయి. ఉభయచర దాడి నౌకలు నావికాదళాలను మోయడానికి, దింపడానికి ఉపయోగపడుతున్నాయి.
 
==రకాలు==
విమాన వాహకనౌకలు వాటి పాత్రల బట్టి, ఆకృతీకరణ బట్టి, పరిమాణం బట్టి వర్గీకరించబడతాయి.
===పాత్ర వలన===
విమాన వాహక వాడుక పద్ధతితో ఆధారపడి ఈ విధంగా వర్గీకరించవచ్చు.
 
#నౌకాదళ విమాన వాహకనౌక: ప్రత్యక్ష యుద్ధంనకు (''Fleet carriers'')
#రక్షణదళ విమాన వాహకనౌక: ఇతర ఓడల కూటమిని రక్షించేటందుకు (''Escort carriers'')
#ఉభయచర దాడి వాహకనౌకలు: భూ మరియు సముద్ర దాడులకు (''Amphibious assault ship'')
#హెలికాప్టర్ వాహకం: హెలికాప్టర్లను మాత్రమే మోసుకునుటకు
#జలాంతర్గామి వ్యతిరేక విమాన వాహకాలు (''Anti-submarine warfare carrier'')
 
===పరిమాణం వలన===
#తేలిక విమాన వాహకం
#నౌకాదళ విమాన వాహకం
#హెచ్చువాహకలు
#భారీ విమానయాన క్రూజర్లు
 
===విమాన మోహరింపు వలన===
విమానాలు ఎగిరే, దిగే విధానాల బట్టి వాహకనౌకలు ముఖ్యంగా నాల్గు విధాలుగా విభజించబడ్డాయి.
 
#కాటాపుల్ట్ ద్వారా ఎగరడం కాని అడ్డగించబడిన దిగడం (CATOBAR)
#హద్దుగల ఎగరడం కాని అడ్డగించబడిన దిగడం (STOBAR)
#హద్దుగల ఎగరడం నిలువుగా దిగడం (STOVL)
#హెలికాప్టర్ వాహకం - నిలువుగా ఎగరడం నిలువుగా దిగడం
 
==భారతదేశ నౌకాదళం==
===ప్రస్తుతం===
ఒక STOBAR వాహకం [[INS విక్రమాదిత్య]], 45,400 టన్నుల పరివర్తిత కీవ్ శ్రేణి విమాన వాహకనౌక. 20 జనవరి 2004 లో, కొన్ని ఏళ్ళ రాజీ తర్వాత 16 వేల కోట్ల రూపాయలకు భారత ప్రభుత్వం ఈ వాహకం కొన్నది. జూలై 2013లో సముద్ర పరీక్షలు, సెప్టెంబర్ 2013లో వాయు పరీక్షలు విజయవంతంగా ఈ ఓడ పూర్తిచేసింది. ఇది అధికారికంగా సెవెరొడ్విన్స్క్, రష్యా జరిగిన ఒక వేడుకలో 16 నవంబర్ 2013 న ప్రారంబించబడింది. <ref name= ibnlive>{{cite web|title=Aircraft carrier INS Vikramaditya inducted into Indian Navy| publisher = IN | url = http://ibnlive.in.com/news/aircraft-carrier-ins-vikramaditya-inducted-into-indian-navy/434490-3.html | work = IBN Live |accessdate= 16 November 2013}}</ref>
 
ఒక STOVL వాహకం [[INS విరాట్]], 28,700 టన్నుల పాత బ్రిటిష్ మార్పు చెందిన హెచ్.ఎం.ఎస్. హెర్మస్ వాహకం. 1986లో కొనుగోలు, 1987లో నియమించబడింది, 2016 నాటికి ఉపసంహరించనుంది. <ref>{{Cite web|url = http://www.thehindu.com/news/national/ins-viraat-to-be-decommissioned-in-2016/article6884261.ece|title = INS Viraat to be decommissioned in 2016|date = |accessdate = |website = |publisher = |last = |first = }}</ref>
 
===భవిషత్తు===
40,000 టన్నుల, 260 మీటర్ల పొడువుగల విక్రాంత్ శ్రేణి విమాన వాహకనౌక 2009 లో నిర్మించటం మొదలుపెట్టింది.
 
==సూచికలు==
{{Reflist|2}}
"https://te.wikipedia.org/wiki/విమాన_వాహకనౌక" నుండి వెలికితీశారు